Tuesday, April 22, 2025

పండూ.. హ్యాపీ బర్త్​ డే

మిగతా ఫీల్డ్స్ సంగతి ఎలా ఉన్నా గ్లామర్ ఫీల్డ్‌లో మాత్రం రారాజు ఎవరంటే వయసు వెనక్కి వెళ్లేవాళ్లు. అసలు వయసు ఎంతున్నా.. చూడ్డానికి మాత్రం ఏం ఉన్నాడ్రా బాబూ అనేట్టుగా నవ మన్మథుడి మాదిరిగానే కనిపించాలి. ఎంత నవ యవ్వనంగా కనిపిస్తే అంత క్రేజ్, ఫాలోయింగ్ అన్నమాట. ఈ విషయంలో మహేష్ బాబు వయసు వెనక్కి వెళ్లే వరంతో ఏమైనా పుట్టాడా అనేట్టుగానే ఉంటాడు. కాస్త అతిశయోక్తిగానే ఉన్నా మహేష్ బాబు.. వయసు , అందం గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంది అనేట్టుగానే ఉంది. బర్త్ డే పూట ఎక్కడ చూసినా పొగడ్తలు.. ప్రశంసలే ఉంటాయి కనుక.. ఈ ఘట్టమనేని వంశోద్ధారకుడికి 49వ పుట్టినరోజు శుభాకాంక్షలు.

సినిమా కవిత్వం.. రాజకుమారుడిగా ఎంట్రీ.. గుంటూరు కారంతో ..!

నటశేఖరుడు వారసుడిగా ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘రాజకుమారుడి’గా ఎంట్రీ ఇచ్చి ‘యువరాజు’గా వెలుగొంది.. ‘మురారి’తోమెప్పించి.. అమ్మాయిల మనసుదోచే ‘టక్కరిదొంగ’గా మారాడు. ఆ ‘ఒక్కడు’కి ఎదురేలేకుండా తన ‘దూకుడు’ ఆపకుండా ‘పోకిరి’తో తన ‘ఖలేజా’చూపిస్తూ బాక్సాఫీస్‌ని షేక్ చేసే ‘సైనికుడి’గా మారి టాలీవుడ్ ఇండస్ట్రీ సింహాసనంపై సూపర్ స్టార్ అయ్యారు.
‘అతిథి’లా అప్పుడప్పుడూ కాకుండా .. పక్కా ‘బిజినెస్‌మేన్’లా మారి..‘1 నేనొక్కడినే’నంటూ ‘స్పైడర్’మేన్‌లా దూసుకెళ్లి.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లా విరజిల్లే‘అతడు’ ఈ టాలీవుడ్ ‘శ్రీమంతుడు’.. ‘భరత్ అనే నేను’.. అంటూ బ్రహ్మాండమైన హిట్ కొట్టి.. ‘మహర్షి’తో ఇండస్ట్రీని షేక్ చేసి ‘సరిలేరు నీకెవ్వరు’ అనిపించుకున్న మహేష్ బాబు పుట్టినరోజుని‘బ్రహ్మోత్సవం’లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆయన అభిమానులు. ‘సర్కారు వారి పాట’ అంటూ ఇండస్ట్రీని వేలం వేసి.. గుంటూరు కారంతో ఘట్టమనేని దెబ్బ చూపించారు.

ఒక సినిమా గుర్తుంది కదా..

మహేష్.. ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ పేరులో మత్తు ఉంది” అంటూ హీరోయిన్​ తెగ ఫీల్​ అవుతూ ఉంటుంది. నిజంగానే సినిమాలను ఇష్టపడే లేడీ ఫ్యాన్స్ కూడా ఇదే ఫీలవుతూ ఉంటారు. మహేష్‌‌‌‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.

టాలీవుడ్‌‌‌‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేష్ ఒకరు. నట శేఖర కృష్ణ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో.. టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. నేటితో 49వ పడిలోకి అడుగుపెడుతున్నారు మహేష్. మహేష్ పుట్టిన రోజును అభిమానులు సోషల్ మీడియాలో సంబరంగా జరుపుకుంటున్నారు. దర్శకేద్రుడు రాఘవేంద్రరావు మహేష్ బాబును హీరోగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్‌‌‌‌గా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు సూపర్ స్టార్. 1987లో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంఖారావం చిత్రంలో నటించాడు. 1988 లో విడుదలైన కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ చిత్రంలో అన్నయ్య రమేష్‌‌‌‌‌తో కలిసి నటించాడు. అలాగే కృష్ణ నటించిన ముగ్గురు కొడుకులు, గూడచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న- తమ్ముడు సినిమాల్లో నటించాడు మహేష్. కొడుకు దిద్దిన కాపురం సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్‌‌‌‌లో కనిపించి ఆకట్టుకున్నాడు.

ఆతర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన మహేష్ చదువు పై దృష్టి పెట్టారు. తిరిగి హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నటించిన యువరాజు, వంశీ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోయినప్పటికీ మహేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నడు మహేష్ బాబు. 2001 లో విడుదలైన మురారి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌‌‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆతర్వాత టక్కరిదొంగ, బాబీ సినిమాలు విజయాన్ని అందుకోలేదు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. 2003 అతి పెద్ద సినిమాగా పేరు తెచ్చుకుంది ఈ సినిమా. అప్పటివరకు ఉన్న రికార్డులను ఒక్కడు సినిమా తిరగరాసింది. ఆ తర్వాత విడుదలైన నిజం సినిమా హిట్ టాక్ తెచుకోకపోయినప్పటికీ మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలో మహేష్ నటనకుగాను నంది అవార్డు వరించింది. ఇక నాని, అర్జున్ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాదించనప్పటికీ పర్లేదు అనిపించుకున్నాయి. ఇక ఆతర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. రికార్డ్‌‌‌‌లను తిరగరాయడంతోపాటు…ఇండస్ట్రీ హిట్‌‌‌గా నిలించింది ఈ సినిమా. ఆతర్వాత టాప్ హీరోగా కంటిన్యూ అవుతూ వస్తున్నాడు సూపర్ స్టార్. అలాగే అతిథి , ఖలేజా, దూకుడు , బిజినెస్ మేన్ , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , ఆగడు, శ్రీమంతుడు హర్ష, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్ అనే నేను భరత్, మహర్షి , సరిలేరు నీకెవ్వరు, సర్కారి వారి పాట, గుంటూరు కారం ఇలా వరుస సినిమాలతో అలరించారు మహేష్.

రీల్ హీరో టూ రియల్ హీరో

నటశేఖర కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. నటనలో స్క్రీన్ ప్రెజెన్స్ లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు, ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాడు. పాన్ ఇండియా మూవీ చేయకుండానే నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ‘ప్రిన్స్’ గా, ‘సూపర్ స్టార్’గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు. మహేష్ అనే పేరులోనే ఏదో మ్యాజిక్ ఉందంటారు సినీ అభిమానులు. హాలీవుడ్ హీరోలను తలదన్నే పిజిక్ తో స్టన్నింగ్ లుక్స్ లో కనిపించే మహేశ్.. ఎప్పటికీ అమ్మాయిలకు కలల రాకుమారుడే. ఆయనకు ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. ఏళ్ళు గడిచే కొద్దీ మరింత హ్యాండ్సమ్ గా మారిపోతున్నాడు. నేటితో 49వ పడిలోకి అడుగుపెడున్నాడు.

మహేశ్ బాబు బాల్యం, బాలనటుడిగా తెరంగేట్రం..

కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు 1975 ఆగస్టు 9వ తేదీన మద్రాస్‌లో జన్మించాడు ఘట్టమనేని మహేశ్ బాబు. తండ్రి హీరో కావడంతో చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణానికి అలవాటు పడిన మహేష్.. నాలుగేళ్ళ వయసులోనే తన అన్న రమేశ్ బాబుతో కలిసి ‘నీడ’ చిత్రంతో తొలిసారిగా వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత 1983లో ‘పోరాటం’ సినిమాతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. మొదటి మూవీ అయినా, ఎలాంటి బెరుకు లేకుండా కెమెరా ముందు నటించి శభాష్ అనిపించుకున్నాడు. ఇదే క్రమంలో తన తండ్రి హీరోగా నటించిన పలు చిత్రాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ‘శంఖారావం’ ‘బజారు రౌడీ’, ‘ముగ్గురు కొడుకులు’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘గూఢచారి 117’, ‘అన్న-తమ్ముడు’, ‘బాలచంద్రుడు’ వంటి చిత్రాలతో అలరించాడు. అయితే చదువుల మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో కొనేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు.

అరంగేట్రంతోనే నంది అవార్డ్..

1999 లో ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు మహేశ్ బాబు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ సాధించి, డెబ్యూ హీరోగా నంది అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘యువరాజు’ సినిమా కూడా మంచి విజయం సాధించింది. రెండో సినిమాకే ఒక బాబుకు తండ్రిగా నటించడం ఆయనకే చెల్లింది. ‘మురారి’ మూవీతో తనలోని పరిపూర్ణమైన నటుడిని బయటకు తీసాడు మహేశ్. ‘టక్కరి దొంగ’ ‘ఒక్కడు’ సినిమాలు అతడికి మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. ‘నిజం’ చిత్రంతో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్న ప్రిన్స్.. ‘నాని’ వంటి ప్రయోగాత్మక సినిమాతో ప్లాప్ రుచిచూసాడు. ఆ తర్వాత వచ్చిన ‘అర్జున్’ ‘అతడు’ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

‘పోకిరి’తో ఇండస్ట్రీ రికార్డ్..

2006 లో వచ్చిన ‘పోకిరి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటికి ఉన్న రికార్డులను చెరిపేసి, సరికొత్త ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పింది. మహేశ్ బాబును సూపర్ స్టార్ గా ఆవిష్కరించింది. అయితే ఆ తర్వాత మరో సక్సెస్ అందుకోడానికి అగ్ర హీరోకి ఐదేళ్లు పట్టింది. ‘సైనికుడు’, ‘అతిథి’, ‘ఖలేజా’ వంటి చిత్రాలు తీవ్ర నిరాశ పరిచాయి. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన ‘దూకుడు’ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, మహేశ్ ను మళ్ళీ రేసులో నిలబెట్టింది. ఇదే క్రమంలో ‘బిజినెస్ మ్యాన్’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలు ఘన విజయం సాధించాయి. ‘1 నేనొక్కడినే’ చిత్రం పరాజయం పాలైనప్పటికీ, ఫ్యాన్స్ కు ఫేవరేట్ మూవీగా నిలిచింది. అయితే ‘ఆగడు’ ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ సినిమాలు మాత్రం గట్టి దెబ్బ కొట్టాయి.

‘శ్రీమంతుడు’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్.. ‘భరత్ అనే నేను’ చిత్రం తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘సర్కారు వారి పాట’ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. మహేష్ బాబు స్టార్ పవర్ ఏంటో చూపించాయి. ఈ ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా కూడా రికార్డు దక్కించుకున్నది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దీని తర్వాత ఓ భారీ ప్రాజెక్ట్ కోసం దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళితో చేతులు కలపబోతున్నారు. ఇప్పటిదాకా పాన్ ఇండియా గురించి ఆలోచించని మహేష్.. ఈసారి ఏకంగా గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేయబోతున్నారు.

బెస్ట్ యాక్టర్ అవార్డుల్లో చిరంజీవి తర్వాత మహేషే..

హీరోగా 24 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు.. ఇప్పటి వరకూ 27 చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారాలను 8 సార్లు (రాజకుమారుడు, మురారి, టక్కరి దొంగ, అర్జున్. నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు) అందుకున్నారు. అలానే 5 ఫిలిం ఫేర్ అవార్డులతో పాటుగా, నాలుగు సైమా అవార్డులు దక్కించుకున్నారు. ఇవే కాకుండా జీ సినీ అవార్డ్స్, ఐఫా ఉత్సవం లాంటి మరికొన్ని పురస్కారాలు మహేష్ ఖాతాలో ఉన్నాయి.

రియల్ హీరో మహేశ్..

మహేష్ బాబు నటుడిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో.. తన సేవాగుణంతో అంతకంటే మంచి పేరు తెచ్చుకున్నారు. తన సంపాదనలో 30 శాతం సమాజ సేవకు వెచ్చిస్తూ, ‘రియల్ హీరో’ అనిపించుకున్నారు. ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ, తన మంచి మనసును చాటుకుంటున్నారు. అలానే తెలుగు రాష్ట్రాలలో రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మన సూపర్ స్టార్‌లో దాతృత్వ లక్షణాలు కూడా ఎక్కువే. 2016 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రం నుంచి సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్న ఈ శ్రీమంతుడు.. ఆ గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ అక్కడి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అదేవిధంగా ఎంతోమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి మానవత్వం చాటుకున్నారు మహేష్. ఆర్ధికంగా బలంగా లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ నిజ జీవితంలోనూ గొప్ప వ్యక్తిగా కీర్తించబడుతున్నారు సూపర్ స్టార్.

మరి సూపర్ స్టార్ బర్త్ డే అన్నాక రెండు తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు హోరెత్తిపోవాల్సిందే కదా!. అయితే అందుకు సిద్దమైన ఫ్యాన్స్‌ని రిక్వెస్ట్ చేస్తూ ఈ ఏడాది ఎవ్వరూ సామూహిక వేడుకలు జరపొద్దని కోరారు మహేష్. కరోనా విలయతాండవంలో అంతా జాగ్రత్తగా ఉండాలని, ఎవ్వరూ బయటకు రావొద్దని, తనపై అందరి అభిమానం ఎప్పుడూ ఉండాలని కోరారు. ఈ రియల్ సూపర్ స్టార్‌కి మీ, మా ‘సమయం తెలుగు’ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్ సినీ కెరీర్‌లో ఇంకా ఎన్నో మైలురాళ్ళు దాటాలని కోరుకుంటున్నాం.

నిర్మాతగా మహేశ్..

అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరిగా ఉన్న మహేశ్ బాబు.. తండ్రి మాదిరిగానే నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నారు. జీఎంబీ ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించి న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. తాను నటించే సినిమాలలో నిర్మాణ భాగస్వామిగా ఉండటమే కాదు.. ఇతర హీరోలతో చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆ విధంగా తీసిన ‘మేజర్’ మూవీ మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక తన తోటి హీరోలకు మద్దతుగా నిలవడానికి మహేశ్ ఎప్పుడూ ముందే ఉంటారు. ‘జల్సా’ ‘బాద్ షా’ ‘ఆచార్య’ వంటి చిత్రాలకు ఆయన వాయిస్ ఓవర్ అందించారు.

పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్..

‘వంశీ’ సినిమాలో తనతో కలిసి నటించిన హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ను మహేశ్ బాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా గౌతమ్ కృష్ణ, సితార వంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అటు పర్సనల్ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లను సమానంగా లీడ్ చేస్తున్న అతి తక్కువ మంది హీరోలలో మహేష్ ఒకరని చెప్పొచ్చు. సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా, కుదిరినప్పుడల్లా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంటారు. అందుకే ఆయన్ని ‘పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్’ అంటుంటారు.

హ్యాపీ బర్త్​ డే మహేష్​

సూపర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పండగ రోజు రానే వచ్చింది. నేడు (ఆగస్టు 9) సూపర్ స్టార్ మహేష్ బాబు 49వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలనటుడిగా సినీ కెరీర్ ఆరంభించి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు చిత్రసీమలో తండ్రికి తగ్గ తనయుడిగా గొప్ప పేరు సంపాదించారు మహేష్ బాబు. సినిమాల పరంగా కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదరురైనా కూడా అన్నింటికీ తట్టుకొని తనకు సరిలేరు ఇంకెవ్వరూ! అనే పేరు తెచ్చుకున్నారు. విలక్షణ పాత్రలు పోషిస్తూ ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటుడిగా మహేష్ బాబుకి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన కెరీర్‌లో వచ్చిన ”టక్కరి దొంగ, శ్రీమంతుడు, స్పైడర్, నేనొక్కడినే, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, గుంటూరుకారం సినిమాలు దేనికవే ప్రత్యేకం. జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగు చిత్రసీమలో తాను మాత్రమే చేయగలను అనేలా ఈ సినిమాలతో సత్తా చాటారు మహేష్. ఆయన కెరీర్‌‌ని మలుపుతిప్పిన సినిమాలుగా ”అతడు, పోకిరి” మహేష్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com