Sunday, April 6, 2025

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయ దశమి శుభాకాంక్షలు

అమరావతి:- విజయదశమి సందర్భంగా దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు. ప్రజలంతా సుఖ శాంతులతో వర్థిల్లేలా చూడాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని వేడుకుంటున్నాను. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే దసరా పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలిసిమెలిసి జీవించాలన్నదే దసరా పండుగ సందేశం.

ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దాం. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ పండుగ దినాల్లో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నాం. మరో వైపు ఆ దేవదేవుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుకున్నాం. ఇదే ఒరవడితో సర్వజన సంక్షేమాన్ని కొనసాగిద్దాం. మరొక్క మారు అందరికి మనస్ఫూర్తిగా దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను నారా చంద్రబాబు నాయుడు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com