Sunday, March 16, 2025

రేవంత్ రెడ్డి.. కేసీఆర్ చావును కోరుకున్నారు..

అందుకే సీఎం ప్రసంగాన్ని బహిష్కరించాం
అసెంబ్లీలో హరీష్ రావు చిట్ చాట్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బహిష్కరించామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ..  పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు. అందుకే సీఎం స్పీచ్ ను బహిష్కరించాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే 299 టీఎంసీల నీటి పంపకాలు చేశారు. 299 టిఎంసీల నీటి వినియోగం కంటే ఎక్కువ ప్రాజెక్టులు లేవు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి 299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించారు. ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్ దే అని హరీష్ రావు విమర్శించారు.

దిల్లీలో రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ వెళ్లి ఎందుకు ఒప్పుకొని వొచ్చారు. పోతిరెడ్డిపాడు కోసం పీజేఆర్ కొట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్క రోజు కూడా వ్యతిరేకించలేదు.. మేం 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేశాం. తెలంగాణ కోసం మేము ఆ రోజు 6 మంత్రి పదవులు వదులుకున్నాం. ఉత్తమ్ చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వొచ్చారు. కృష్ణ నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారు.

ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీశైలం ఖాలీ చేసేలా ద్రోహం చేశారు  సెక్షన్ 3ని సాధించింది కేసీఆరే. 573 టిఎంసీల నీళ్లు సెక్షన్ 3 ద్వారా తెచ్చాం.  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తామే స్టే తెప్పించాం. నల్గొండలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.. కృష్ణా నీళ్లను సముద్రంలో కలిపారు.. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు కట్టడం వల్ల ఖమ్మంకి నీళ్లు ఇవ్వగలిగాం. హుజూర్ నగర్ ని ముంపుకు గురి చేసి ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇచ్చారు.. పులిచింతల నిర్వాసితులకు వందల కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడుకున్నాం అని హరీష్ రావు వివరించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com