Friday, November 15, 2024

పార్టీ మారితే ఉప ఎన్నికలు తథ్యం

పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. సుప్రీమ్‌ ‌కోర్టును త్వరలో ఆశ్రయించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై డిస్‌ ‌క్వాలిఫై ఆర్డర్‌ ‌తీసుకువచ్చి ఉప ఎన్నికలు జరిగేలా చూస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ‌మళ్లీ పుంజుకుని సత్తా చాటుతామన్నారు. ఇన్నాళ్లూ అభివృద్ధి కోసం పనిచేసి, వాస్తవానికి కార్యకర్తలను పట్టించుకోలేదని ఇక నుంచి ఆ పొరపాటు జరగదని ఆయన అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని బీఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకులు వెన్నవరం ఆదర్శ్ ‌రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, మాజీ స్పీకర్‌ ‌మధుసూదనా చారి, మాజీ శాసనమండలి చైర్మన్‌ ‌వెన్నవరం భూపాల్‌ ‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ, భారతీనగర్‌ ‌కార్పొరేటర్‌ ‌వెన్నవరం సింధు ఆదర్శ్ ‌రెడ్డి లతో రాష్ట్ర మాజీ మంత్రి హరీష్‌ ‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనపుడు కూడా పిడికెడు మందితో ఉద్యమించామని, గతంలో తెలంగాణ రాకుండా టీఆర్‌ఎస్‌ ‌ను కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని, టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యేలను తమవైపు తీసుకున్నారని అన్నారు.

పటాన్‌ ‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డికి పార్టీ ఏం అన్యాయం చేసిందని, పార్టీ అధికారంలో లేనపుడు కష్టాలు వస్తాయని, తట్టుకోలేక పారిపోవటం బావ్యం కాదని అన్నారు. పటాన్‌ ‌చెరుకు నిధుల వరద పారించాం, ఏం తక్కువ చేశామన్నారు. గూడెం పోయినా కార్యకర్తలు గుండె ధైర్యం మాత్రం కోల్పోవద్దని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ‌మూడుసార్లు అవకాశం ఇచ్చి గూడెం మహిపాల్‌ ‌రెడ్డిని గెలిపించినప్పటికీ పార్టీ మారడానికి ఎలా మనసు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ జీవోలు ఒకరకంగా ఉన్నాయని, చేసేది మరోలా ఉందన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి మాటలు చెబుతూ రైతులకు కోతలు విదిస్తున్నారని ఎద్దేవా చేశారు. పటాన్‌ ‌చెరు నియోజకవర్గంలో కార్యకర్తలు ధైర్యాన్ని కోల్పోవద్దని, నియోజకవర్గంలో ఎమ్మెల్యేను, కార్పోరేటర్లను, స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అందరినీ గెలుపించుకునే బాధ్యత నాదని హామీని ఇచ్చారు.

ఇప్పటి వరకు ప్రజా సంక్షేమం చూశాం, రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు. ఆరు గ్యారంటీలు పెట్టిన కాంగ్రెస్‌ ఏ ‌గ్యారంటీని సరిగా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హమీల్లో ఒక బస్సు తప్ప అంతా తుస్సేనన్నారు. కాంగ్రెస్‌ ‌పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందని, మరో ఆరు నెలల్లోనే కాంగ్రెస్‌ ‌పార్టీని ప్రజలు తిప్పికొట్టే పరిస్థితి వస్తుందని చెప్పారు. ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటం చేస్తామని, పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిస్‌ ‌క్వాలిఫై చేస్తామన్నారు. మళ్లీ ఉప ఎన్నికలు తధ్యమని అన్నారు. వారం, పదిరోజులలో విస్తృత స్థాయిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పటాన్‌ ‌చెరు కార్పొరేటర్‌ ‌మెట్టు కుమార్‌ ‌యాదవ్‌, ‌బొల్లారం మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌కొలన్‌ ‌రోజా బాల్‌ ‌రెడ్డి, తెల్లాపూర్‌ ‌మున్సిపల్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌బి.రాములు గౌడ్‌, ‌మాజీ కార్పొరేటర్లు శంకర్‌ ‌యాదవ్‌, అం‌జయ్య యాదవ్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు మల్లెపల్లి సోమిరెడ్డి, కొలన్‌ ‌బాల్‌ ‌రెడ్డి, జగన్నాథ్‌ ‌రెడ్డి, వెంకటేష్‌ ‌గౌడ్‌, ‌శ్రీధర్‌ ‌చారి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular