Tuesday, December 24, 2024

సిఎం రేవంత్‌ ‌పదవి ఊడడం ఖాయం..

ఈ ‌ప్రభుత్వం అశాశ్వతం..మేమే శాశ్వతం.. మళ్లీ వొచ్చేది మా ప్రభుత్వమే.. అధికారులు వొళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని పని చేయాలి. సిఎం రేవంత్‌ ‌పదవి ఊడడం ఖాయం. ఆయన ఆడించినట్లు ఆడితే తరువాత మూల్యం చెల్లించుకోక‌ తప్పదంటూ బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌ఘాటు హెచ్చరికలు చేశారు. ఆడించినట్లు ఆడితే ఉన్నతాధికారుల ఉద్యోగాలు ఊడగొడుతామని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌హెచ్చరించారు. తెలంగాణలో వొచ్చేది బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమేననిసీఎం రేవంత్‌ ‌రెడ్డిపొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి ,మెగా కృష్ణారెడ్డిలు తెలంగాణను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం కేటీఆర్‌ ‌తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.. నీటి ప్రాజక్టుల పేరుతో ముఖ్యమంత్రి భారీ స్కాంలకు తెర తీశారనిమంత్రి పొంగులేటి రాఘవ కన్‌‌స్ట్రక్షన్స్‌మెగా కృష్ణారెడ్డి కంపెనీలు పంచుకుంటున్నాయని విమర్శించారు. దీనిపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ ఎం‌దుకు మాట్లాడటం లేదని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. భారీ స్కాంలు జరుగుతుంటే.. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.

క్యాబినెట్‌లో ఉంటే మంత్రి పొంగులేటి కంపెనీకి కాంట్రాక్టులు ఎలా ఇస్తారన్నారు. పొంగులేటి జైలుకు పోవడానికి రెడీగా ఉండాలన్నారు. వాళ్ళువీళ్ళు జైలుకు పోతారని చెప్పటానికి పొంగులేటి ఎవరని ప్రశ్నించారు. పొంగులేటి ఏమైనా హోంమంత్రినా.. అని అన్నారు. బాంబులు పేల్చుడు కాదు.. ముందు పొంగులేటి జైలుకు పోవటానికి రెడీగా ఉంటాలని కేటీఆర్‌ అన్నారు. మూసీ ప్రాజెక్ట్ ‌కోసం సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆగమాగం అవుతున్నారనిమూసీ ప్రాజెక్ట్ ‌కాంట్రాక్టు సైతం మెగా కృష్ణారెడ్డికి చెందిన ఈస్ట్ ఇం‌డియా కంపెనీకి ఇవ్వనున్నారని అన్నారు. మహారాష్ట్రదిల్లీకి మూటలు వెళ్తున్నాయనితెలంగాణలో బీజేపీకాంగ్రెస్‌ ‌పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీకాంగ్రెస్‌లను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామనిపొంగులేటిపై ఈడీ రైడ్స్ ‌జరిగితే చర్యలు ఎందుకు తీసుకోలేదని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు.

కాలేశ్వరం నీళ్లను గండి పేటలో కలిపి మూసీలోకి పంపిస్తారంట.. దీనికోసం రూ. 5,500 కోట్లు ఖర్చు చేస్తారంట.. ఇది మరొక కుంభకోణమని కేటీఆర్‌ ఆరోపించారు. కొండ పోచమ్మ సాగర్‌ ‌నుంచి గోదావరి నీళ్లను హైదరాబాద్‌ ‌తెచ్చేందుకు రూ. 11 వందల కోట్లతో ఖర్చుతో అన్ని సిద్ధం చేశామని తెలిపారు. కానీ పెద్ద ఎత్తున కుంభకోణం చేసేందుకే దీన్ని రూ. 5,500 కోట్లకు పెంచారని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను కూడా ఈస్ట్ ఇం‌డియా కంపెనీ అన్న మేఘా సంస్థకే ఇవ్వటానికి అన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పారు. ఐఏఎస్‌ అధికారులుఇంజనీర్లు రేవంత్‌ ‌రెడ్డి చెప్పినట్లు సంతకం పెడితే మేము అధికారంలోకి వొచ్చాక విచారణ తప్పదని.. వాళ్ల ఉద్యోగాలు ఊడటం ఖాయమని హెచ్చరించారు. ఎక్కడ బిడ్‌ ‌లు చేస్తున్నారో ఆ సంస్థ పేరు కూడా మాకు తెలుసని చెప్పారు.

తెలంగాణ నుంచి మ‌హారాష్ట్ర‌దిల్లీకి మూట‌లు
ఆరు గ్యారంటీలకుహామీలు అమలు చేసేందుకుఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు కూడా పైసలు లేవని రేవంత్‌ ‌రెడ్డి అన్నారని కేటీఆర్‌ ‌తెలిపారు. కానీ మూసీ ప్రాజెక్ట్ ‌కోసం మాత్రం ఆగమేఘాల మీద పనులు చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com