Wednesday, June 26, 2024

ప్రజల్లో హరీశ్ రావు విషబీజాలు నాటుతున్నారు….

  • పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ జీరో కాబోతుంది
  • టిపిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి

బిఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటే వాటిలో తప్పులు, పెడర్ధాలు తీసి ప్రజల్లో హరీశ్ రావు విషబీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారని టిపిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ వీడియోలో మాట్లాడుతూ హరీశ్‌రావు లాంటి వాక్చాతుర్యం తమకు లేదని ఇచ్చిన ప్రతి హామీని నెరేవర్చాలన్న ఉద్దేశంతోనే ముందుడుగు వేస్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ జీరో కాబోతుందని అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జీరోగా మారబోతుందని ఆయన ఎద్దేవా చేశారు.

ఈ పరిణామాలు తట్టుకోలేక హరీశ్ రావు ఇలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గతంలో కాంగ్రెస్ అలయెన్స్ లో ఎమ్మెల్యే కాకుండానే మంత్రిగా అయిన హరీశ్ రావు 2004 నుంచి కంటిన్యూగా అధికారాన్ని ఎంజాయ్ చేశారని ఇప్పుడు అధికారం లేకపోయే సరికి ఉండలేకపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. పవర్ లేక 150 రోజులుగా హరీశ్ రావుకు నిద్రపట్టడం లేదని దాంతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. జూన్ 4 న ఫలితాలు వెలువడిన తర్వాత ప్రజాసంక్షేమంపై దృష్టి సారించా ల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. అప్పుడు ప్రతిపక్షాలు తమ పాత్రను సమర్థవంతంగా పోషించాలన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?

Most Popular