Saturday, May 3, 2025

కవితతో హరీష్ రావు ములాఖత్

లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ

తీహార్ జైల్లో ఉన్న ఎంఎల్ సీ కవితను శుక్రవారం మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు. లిక్కర్ కేసులో జరుగుతున్న పరిణామాలు, బెయిల్ పిటిషన్లపై విచారణ వంటి విషయాలపై ఈ సందర్భంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బెయిల్ పిటిషన్లపై విచారణతో పాటు కుటుంబానికి చెందిన పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌లే మాజీ మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, స‌బితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ క‌విత‌ను కలిశారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ కేసులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఇటీవల కోర్టు మరోసారి పొడిగించింది. జులై 5వ తేదీ వరకు ఆమె కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com