Wednesday, November 20, 2024

టిఫిన్​ కోసం ఎమ్మెల్యే వెళ్లిందా…?

టిఫిన్​ కోసం ఎమ్మెల్యే వెళ్లిందా…?లాస్య నందిత కేసులో అసలేం జరిగింది

టీఎస్​, న్యూస్​ : కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం వెనక అసలు కోణాలు మిస్టరీగా మారాయి. లాస్య నందిత చెల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే పీఏ ఆకాశ్​పై కేసు నమోదు చేశారు. అయితే, పిటిషన్​లో చెప్పిన కొన్ని విషయాలు నమ్మకానికి దూరంగా ఉన్నాయి. దర్గాలో పూజల అనంతరం అందరికీ ఆకలిగా ఉండటంతో టిఫిన్​ తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే లాస్య నందిత వెళ్లిందని చెబుతున్నారు. టిఫిన్​ కోసం ఎమ్మెల్యే.. ఎలాంటి భద్రత లేకుండా వెళ్లడం.. అది కూడా కనీసం చిన్న చాయ్​ డబ్బా కూడా ఉండని ఔటర్​ నుంచి వెళ్లడంపై అనుమానాలు వస్తున్నాయి.

మూడు రోజుల క్రితం తెల్లవారు జామున పటాన్ చెరూ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. ఈ కారును ఆమె పీఏ ఆకాష్ డ్రైవ్ చేస్తున్న క్రమంలో యాక్సిడెంట్ కావడంతో లాస్య నందిత ఘటనా స్థలంలోనే మృత్యువాత పడగా.. పీఏ ఆకాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఘటనకు ముందు ఓ దర్గాలో పూజలు చేసిన లాస్య నందిత ఉదయం నుండి ఆహారం తీసుకోకపోవడంతో టిఫిన్ చేసేందుకని బయలుదేరి వెల్లినట్టుగా చెప్తున్నారు. శామీర్ పేట టోల్ ప్లాజా మీదుగా ఔటర్ మీదుగా ప్రయాణం మొదలు పెట్టారని గుర్తించారు. అయితే ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కడా కూడా టిఫిన్ సెంటర్లు అయితే ఉండవు. ఎక్కడో ఓ చోట ఔటర్ దిగితే తప్ప ఆమెకు టిఫిన్ సెంటర్ దొరికే అవకాశం లేదు. ఆమె ఔటర్ రింగ్ రోడ్డు పైకి వెళ్లకుండా హైదరాబాద్ వైపు వెళ్తే టిఫిన్ దొరికే అవకాశం ఉంటుంది కదా అన్న చర్చ మొదలైంది.
ఎందుకంటే శామీర్ పేట నుండి తూంకుట, జూబ్లి బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బేగంపేట తదితర ప్రాంతాల్లో నిరంతరం జనం రాకపోకలు సాగిస్తుంటారు. జనం రద్దీ ఉన్న ప్రాంతాల్లో హోటల్స్ అందుబాటులో ఉంటాయి కానీ ఔటర్ మీదుగా వెళ్లాలనుకోవడం వెనక ఆంతర్యం ఏంటన్నదే పజిల్ గా మారింది.

శామీర్ పేట నుండి సిద్దిపేట రహదారిలోకి వెల్లినా హోటల్స్ అందుబాటులో ఉంటాయి కానీ… వాహనాల రాకపోకలకు మాత్రమే అనువైన ఔటర్​ పై హోటల్స్​ ఉండవని పక్కాగా తెలిసినా ఆ ప్రాంతం మీదుగా ఎందుకు ప్రయాణం చేశారన్నది మిలియన్​ డాలర్ల ప్రశ్న. తెల్లవారుజూమున కావడంతో స్టార్​ హోటళ్లు, ఉన్నతశ్రేణి హోటల్స్​ తెరిచే చాన్స్​ లేదు. ఒక, హైక్లాస్​ హోటల్స్​లో టిఫిన్స్​ సిద్ధం చేసే పనిలో స్టాఫ్​ ఉంటారు. కానీ, అమ్మకాలు మాత్రం ఉదయం 7 గంటల తర్వాత నుంచి మొదలుపెడుతారు. వేకువల జామున రోడ్లపై ఏర్పాటు చేసే టిఫిన్ సెంటర్లు తప్ప మరో చోట అల్పాహారం అమ్మకాలు మొదలు అవుతాయి. కానీ స్టార్ హోటల్స్ లో మాత్రం టిఫిన్స్ సిద్దం అయ్యే అవకాశం అయితే ఉండదు. తెల్లవారు జామున టిఫిన్ కోసమే లాస్య నందిత ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ప్రయాణించడానికి కారణాలు ఏంటన్నదే ఇక్కడ చిక్కుముడి. సదాశివపేట దర్గాలో పూజలు నిర్వహించి వచ్చిన ఆమె పటాన్ చెరు సమీపంలోని ఔటర్ మీదుగానే ఇంటికి చేరి ఉంటుంది.

వచ్చేప్పుడే ఆ రోడ్డులో హెటల్స్ ఉన్నట్టయితే టిఫిన్ ప్యాక్ చేయించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆమె ఇంటికి చేరి తిరిగి అదే రహదారి మీదుగా వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. కుటుంబ సభ్యులందరిని ఇంటి వద్ద దింపిన తరువాత పీఏ ఆకాష్, లాస్య నందిత మాత్రమే టిఫిన్ కోసం వెల్లాల్సిన అవసరం ఉంటుందా..? అదే పీఏ ఆకాష్ నే టిఫిన్ కోసం పంపించినట్టయితే ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆమెతో ఉన్న సిబ్బందికి అందరికీ సరిపడా టిఫిన్ తీసుకొస్తారు కదా… కుటుంబ సభ్యులంతా కలిసి దర్గాలో పూజలకు హాజరైనప్పుడు కేవలం లాస్య నందితకు మాత్రమే ఆకలి అవుతుందా.? ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆకలితో ఉండే అవకాశం ఉంటుంది కదా..? అలాంటప్పుడు లాస్య నందిత మాత్రమే పీఏ ఆకాష్ ను తీసుకుని టిఫిన్ కోసం వెల్లడం ఏంటన్నదే తేలాల్సి ఉంది. లేనట్టయితే డీర్ డెలివరీ చేసే విధానం కూడా ఉన్నప్పుడు అల్ఫాహారం కోసం వెల్లడం… అందునా ఎమ్మెల్యేనే స్వయంగా టిఫిన్​ కోసం వెళ్లడానికి గల అసలైన కారణం ఏమిటో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఔటర్ మీదుగా వెల్లి టిఫిన్ తీసుకుని రావడానికి కనీసం గంటకు పైగానే సమయం పడుతుంది. అదే సమయంలో ఉప్మా లాంటి టిఫిన్ ఇంటిల్లిపాదికి సరిపడా సిద్ధం చేయవచ్చు కదా అని కూడా అక్కడ ఉన్నోళ్ల మాటే.

లైన్​ తప్పారా..?

ఔటర్ రింగ్ రోడ్డుపై లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ముందుగా ఓ లారీని ఢీ కొట్టిన తరువాత డివైడర్ ను ఢీకొట్టి ఉంటుందని పోలీసుల ప్రాథమికంగా గుర్తించారు. కారు ఇంజన్ భాగం అంతా కూడా దెబ్బతిన్న తీరు, ఇందుకు తగినట్టుగా కొన్ని క్లూస్ కూడా పోలీసులకు లభ్యం అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రక్కులు, కార్లు ప్రయాణించేందుకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేశారు. సపరేట్ గా ఏర్పాటు చేసిన మార్గాల్లో కాకుండా ఎమ్మెల్యే లాస్య నందిత కారు భారీ వాహనాలు వెల్తున్న మార్గంలో వెల్లిందా..? లేక ఆ భారీ వాహనమే కార్లు ప్రయాణించాల్సిన ‘వే’లో వెల్లిందా అన్నదే అంతు చిక్కకుండా పోయింది. సాధారణంగా ఔటర్ పై వాహనాల రద్దీ ఉన్నప్పుడు ఓవర్​ టేక్​ చేసే సమయంలో ఇతర ఇతర వే ను ఎంచుకుంటారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. కానీ, లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు మాత్రం ఇంజిన్​ బాగం దెబ్బతిన్నందున ముందే భారీ వాహనాన్ని ఢీ కొట్టినట్టుగా గుర్తించారు. దీంతో లారీ అయినా కార్లు ప్రయాణించే మార్గంలోకి వచ్చి ఉండాలి.. లేదా ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అయినా లారీలు వెళ్లే మార్గంలో వెళ్లి ఉంటుంది. దీనిపై పోలీసుల దర్యాప్తు కూడా ఇంకా ఏం చెప్పడం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular