Sunday, November 17, 2024

రష్మికను పక్కకు పెట్టారా?

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన తాజా చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీలో రష్మిక మందన్న అతిధి పాత్రలో కనిపించనుందని చాలా రోజులుగా వార్తలు వినిపించాయి. అయితే తీరా సినిమా రిలీజ్ అయ్యాక, నేషనల్ క్రష్ ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. సెట్ లో విజయ్ దేవరకొండ, రష్మిక, మృణాల్ కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో రష్మిక మందన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తగ్గట్టుగానే ఈ మధ్య విడుదలైన ‘కళ్యాణి వచ్చా వచ్చా’ సాంగ్ స్టెప్స్.. ఆ వీడియోలో ముగ్గురూ కలిసి చేసిన స్టెప్పులు ఒకేలా ఉండటంతో రష్మిక ఎంట్రీ వుంటుందని అందరూ ఫిక్స్ అయిపోయారు.

‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో రష్మిక ఎక్కడా కనిపించలేదు. అందుకు తగ్గట్టుగానే ‘కళ్యాణి వచ్చా వచ్చా’ సాంగ్ ను సినిమా అయిపోయిన తర్వాత రోలింగ్ టైటిల్స్ లో వేశారు. ఆ పాటలో రష్మిక వస్తుందేమో అని ఆపరేటర్లు సినిమా ఆపేసే వరకూ సీట్లలో కూర్చొని చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో నిడివి ఎక్కువైందని ఆమె స్పెషల్ క్యామియోని కట్ చేశారేమో అని ఆలోచిస్తున్నారు. నిజానికి ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా 2 గంటల 43 నిమిషాలు బోర్ కొట్టకుండా సాగుతుందని ఇటీవల విజయ్ దేవరకొండ చెప్పారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం సెన్సార్ అయిన తర్వాత కేవలం 150 నిమిషాలు (గం.2. 30 ని.) వచ్చిందంటూ ఏకంగా పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఫైనల్ గా 163 నిమిషాలు (గం.2. 43 ని.) రన్ టైంతోనే సినిమా రిలీజైంది. ఇదంతా చూస్తుంటే రష్మిక మందన్న అతిథి పాత్ర విషయంలోనూ గందరగోళం ఏర్పడుతోంది. సినిమా లెన్త్ ఎక్కువైందని రష్మీక క్యామియో కట్ చేశారు అనుకోడానికి.. ‘ఫ్యామిలీ స్టార్’ పూర్తి నిడివితోనే థియేటర్లలోకి వచ్చింది.

కానీ ఆన్ లైన్ లో వైరల్ అయిన వీడియోలో విజయ్, మృణాల్, రష్మిక మీద ఒక సాంగ్ షూట్ చేసినట్లు కనిపిస్తోంది. ఒకవేళ నిజంగానే నిడివి ఎక్కువైందని ఆమె క్యామియోని పూర్తిగా తొలగించాలని నిర్ణయించుకున్నారా? లేదా ఆ రోజు వీళ్ళ ముగ్గురు మీద చిత్రీకరించిన పాట సినిమా కోసం కాదా? అనేది తెలియడం లేదు. వీరిద్దరూ ‘డియర్ కామ్రేడ్’ మూవీలో జంటగా నటించారు. అప్పటి నుంచే వీళ్ళు ప్రేమాయణం సాగిస్తున్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇద్దరూ ఆ రూమర్స్ ను స్ట్రాంగ్ గా ఖండించనూ లేదు, అంగీకరించనూ లేదు. కానీ ఒకే లొకేషన్స్ లో వేర్వేరుగా ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తుండటంతో.. ఎప్పుడో ఒక రోజు సడన్ గా తమ బంధాన్ని బయటపెడతారని నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular