Thursday, April 3, 2025

రణరంగంగా హెచ్‌సీయూ

  • 400 ఎకరాల భూమి విషయంలో వివాదం
  • కంచ గచ్చిబౌలి భూములను రక్షించాలని విద్యార్థులు ఆందోళన
  • వర్సిటీ లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం, ఏబీవీపీ, వామపక్షాల నేతల యత్నం
  • అడ్డుకున్న పోలీసులు.. స్టేషన్ కు తరలింపు
  • యూనివర్సిటీ వద్ద  ఉద్రిక్తత
  • హైదర్‌గూడ క్వాటర్స్‌ వద్ద పోలీసుల మోహరింపు

కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ  వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు బీజేవైఎంఏబీవీపీవామపక్షాల నేతsలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. దాంతో రేవంత్‌ సర్కారుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదర్‌గూడ క్వాటర్స్‌ వద్ద పోలీసుల మోహరింపు
మరోవైపు హెచ్‌సీయూకు వెళ్తామని ప్రజాప్రతినిధులు ప్రకటించిన సందర్భంగా హైదర్‌గూడ క్వాటర్స్‌ వద్ద పోలీసులు మోహరించారు. మంగళవారం వర్సిటీకి వెళ్లాలని బీజేపీ ఎమ్మెల్యేలునేతల బృందం నిర్ణయించింది. హెచ్‌సీయూ భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. పలువురు బీజేపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే హెచ్‌సీయూ మెయిన్‌ గేట్‌ దగ్గర ధర్నాకు సీపీఎం పిలుపునిచ్చింది. 400 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. మరోవైపు హెచ్‌సీయూ మెయిన్‌ గేట్‌ వద్ద కూడా బలగాలను మోహరించారు. అలాగే హెచ్‌సీయూ భూములపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. తరగతుల బహిష్కరణకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. హెచ్‌సీయూ భూముల అమ్మకానికి సంబంధించి కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే సీపీఎం పార్టీ ఆధ్వర్వంలో హెచ్‌సీయూ వద్ద ఆందోళనకు పిలుపునివ్వగా.. సీపీఐ పార్టీ మాత్రం దీనికి దూరంగా ఉంది. సీపీఐ అనుంబంధ విద్యార్థి సంఘాలు అన్నీ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అలాగే హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఖండించింది.

కాంగ్రెస్‌ సర్కార్‌ ఆచీతూచి వ్యవహరించాలనిప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా రాబోయే తరాలకు ఏం మిగలదని.. దీనిపై సీఎం రేవంత్‌ పునరాలోచన చేయాలనివెనక్కి తగ్గాలని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఇక బీజేపీ ఆధ్వర్యంలో హైదర్‌గూడ క్వార్టర్స్‌ నుంచి హెచ్‌సీయూ వద్దకు వెళ్లి నిరసన చేయాలని నిర్ణయించింది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక బృందంలా ఏర్పడి హైదర్‌గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బయలుదేరి హెచ్‌సీయూ భూముల వద్దకు చేరుకుని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. అయితే ఎమ్మెల్యేలు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు పెద్దఎత్తున హైదర్‌గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్దకు మోహరించారు. ఇప్పటికే ఆ భూములు ప్రభుత్వానివే అంటూ టీజీఐఐసీ ఆధారాలను బయటపెట్టింది. దీనికి సంబంధించి రెండు ప్రకటనలను విడుదల చేసింది. ప్రస్తుతం వివాదం నెలకొన్న భూములను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హెచ్‌సీయూ స్వాధీనం చేసిందనిదానికి బదులుగా వర్సిటీకి సర్కార్‌.. 397 ఎకరాలను బదలాయించిందని స్పష్టం చేసింది. దీనిపై అప్పటి వర్సిటీ రిజిస్ట్రార్‌ సంతకం చేశారని తెలిపింది. సంబంధిత కాపీలను సీఎంవో విడుదల చేసింది. అయితే కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటూ టీజీఐఐసీ చేసిన ప్రకటనను హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ ఖండించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com