Thursday, December 12, 2024

బిడ్డను వేధించాడని.. కువైట్‌ నుంచి వచ్చి చంపేశాడు

కన్న కూతురుకు జరిగిన ఘటనపై ఓ తండ్రి ఆగ్రహాన్ని ఆపలేకపోయింది. లైంగికంగా వేధిస్తున్న సమీప బంధువును సజీవంగా చూడలేక చంపేశాడు. ఇక్కడో.. అక్కడో కాదు.. హత్య చేసేందుకు కువైట్‌ నుంచి వచ్చి.. చంపేసి తిరిగి వెళ్లిపోయాడు. అక్కడకు వెళ్లాక అసలు విషయాన్ని బహిర్గతం చేశారు. అయితే, అంతకు ముందే పోలీసులకు చెప్పినా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

తమకు అన్యాయం జరిగిదంటూ ఎవరైనా ఆశ్రయించినప్పుడు పోలీసులు సకాలంలో సరిగ్గా స్పందించకపోతే బాధితుల్లో ఎంత ఆవేదన గూడు కట్టుకుంటుందో, ఒక్కోసారి ఓర్చుకోలేక ఎలా ప్రవర్తిస్తారో తెలియజేసే ఉదంతం ఇది. తన బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగ్గా స్పందిచకపోవడంతో ఆవేదనకు గురైన తండ్రి కువైట్‌ నుంచి వచ్చి అతడిని హతమార్చాడు. తిరిగి కువైట్‌ వెళ్లిపోయిన అతడు వీడియో విడుదల చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్ గా మారింది.

ఏం జరిగిందంటే..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటకు చెందిన ఓ కుటుంబం కువైట్​లో ఉంటున్నారు. దీంతో వారి కుమార్తెను ఊళ్లో ఉంటున్న చెల్లెలు ఇంటి దగ్గర ఉంచారు. ఇటీవల ఓ వ్యక్తి మనవరాలి వరుసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లికి ఫోన్​లో చేసి చెప్పగా, ఆమె వెంటనే చెల్లెకి ఫోన్​ చేసి అడగ్గా సరిగ్గా స్పందించలేదు. దీంతో ఆందోళనకు గురైన బాలిక తండ్రి కువైట్​ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పిలిపించి మందలించి వదిలేశారు. అనంతరం బాలిక తల్లి ఈ విషయాన్ని భర్తకు తెలిపింది.

తట్టుకోలేక.. చంపేందుకు రెడీ
ఈ విషయం తెలిసిన తండ్రి.. తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటని పలుమార్లు ప్రశ్నించాడు. తన బిడ్డ పట్ల అలా ప్రవర్తించిన వ్యక్తిని వదిలేది లేదనుకున్నాడు. బాలిక తండ్రి కువైట్‌ నుంచి వచ్చి, శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నింద్రిస్తున్న అతడిని ఇనుప రాడ్డుతో మోది హత్య చేసి వెంటనే కువైట్‌ వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని వివరిస్తూ బాలిక తండ్రి సామాజిక మాధ్యమాల్లో వీడియోని పోస్ట్‌ చేశారు. ఆడపిల్ల తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని వెల్లడించారు. చట్ట ప్రకారం తమకు న్యాయం జరగనందుకు హత్య చేశానని పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular