ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందచేసినహెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ నాయకులు ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ నాయకులు వినతిపత్రం అందచేశారు. ఈ వినతిలో భాగంగా పదోన్నతులు, పే స్కేల్, బదిలీలు లేకుండా ఇబ్బంది పడుతున్నామని, ఈసారి తమకు వాటిని కల్పించాలని కోరుతూ హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ నాయకులు ఎక్సైజ్, టూరిజం శాఖమంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రాన్ని అందించారు.
మంగళవారం సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజి రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈ. నాగరాజ్, కోశాధికారి జె. అరవింద్‌లు కలిసి ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లిని కలిశారు. ప్రధానంగా ఆరు సంవత్సరాల నుంచి బదిలీలు లేకపోవడంతో ఒకే చోట పని చేస్తున్నామని, చెక్‌పోస్ట్‌ల వద్ద పని చేస్తున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, తమకు ఈ సారి జరిగే బదిలీల్లో అవకాశాలు కల్పించాలని వారు మంత్రిని కోరారు. చెక్‌పోస్టుల నుంచి స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లకు బదిలీలు చేయాలని, పదోన్నతులు వెంటనే ఇవ్వాలని వారు మంత్రిని కోరారు.