Monday, November 18, 2024

ఆరోగ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధ్యేయం..ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యం

ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
నిడదవోలులో స్వచ్ఛత హీ సేవా -2024 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొన్నమంత్రి కందుల దుర్గేష్
ప్రజల ప్రాణాలు రక్షించే క్రమంలో వైద్యుల పాత్ర, సేవానిరతిని అభినందించిన మంత్రి దుర్గేష్
నిడదవోలు: ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యమని  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం ఉదయం నిడదవోలులో స్వచ్ఛత హీ సేవా -2024 కార్యక్రమంలో  భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన స్వయంగా పరిశీలించిన మంత్రి దుర్గేష్ ప్రత్యక్షంగా వైద్యులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజలందరి ఆరోగ్య రక్షణ కోసం నిడదవోలులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. నిడదవోలు నియోజకవర్గ ప్రజల రుగ్మతలను, ఇతరత్రా వైద్య సమస్యలను నయం చేసేందుకు స్థానిక డాక్టర్లే కాకుండా ఇతర ప్రాంతాల నుండి వివిధ విభాగాల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది వచ్చారని మంత్రి తెలిపారు.  స్వచ్ఛతాహి సేవా -2024లో పాల్గొన్న ఆరోగ్య సిబ్బందికి మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల ప్రాణాలు రక్షించే క్రమంలో వైద్యుల సేవలను, సేవానిరతిని మంత్రి కొనియాడారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో  పాలుపంచుకోవాలని కోరారు. దేశాన్ని ఆరోగ్యవంతంగా తయారుచేసుకునేందుకు, రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నిడదవోలు పీహెచ్ సీ డాక్టర్ పద్మశ్రీ,, సూపరింటెండెంట్ ఆలీ, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
………..
జారీ చేసిన వారు: పీఆర్వో, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular