Sunday, September 29, 2024

ఒకట్రెండేళ్ళలో వైద్య ఆరోగ్య శాఖలో స్థిరమైన మార్పులు

  • కేసీఆర్ కిట్ లోనూ మార్పులు తీసుకొస్తాం
  • వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా

రాష్ట్రంలో ఒకట్రెండేళ్ళలో వైద్య ఆరోగ్య శాఖలో స్థిరమైన మార్పులు తీసుకు రానున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. కేసీఆర్ కిట్ లోనూ మార్పులు తీసుకురాబోతున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టి గా మంత్రి రాజనర్సింహా మాట్లాడారు. ప్రతి 35 కి.మీ.కు ఒక ట్రామ సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ప్రస్తుతం ఉన్న ట్రామా సెంటర్లకు తోడుగా కొత్తగా 75 సెంటర్ లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రభుత్వ ఆస్పత్రులకు లింక్ చేసే విధంగా చర్యలు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. ప్రజారోగ్యమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల పర్యవేక్షణ, ఫార్మా మెడికల్ కోసం (డ్రగ్స్ నియంత్రణ ), ఫుడ్ క్వాలిటీ కోసం మూడు రకాల టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందని, అయితే రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఫ్యాకల్టీ తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంతో మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. మెడికల్ కళాశాలల ఏర్పాటులో ప్రాంతాల వారిగా ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. వైద్య వృత్తి వృద్ధి నెమ్మదినెమ్మదిగా పెరుగుతోందన్నారు. గతంలో కేసీఆర్ డాక్టర్ , ఇంజనీరుగా అవతారమెత్తి కరోనాకు పారాసిటమాల్ మాత్ర వేసుకుంటే సరిపోతుందంటూ మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును తానే డిజైన్ చేశానని కేసీఆర్ పదే పదే పేర్కొన్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.

ప్రపంచంలోనే అత్యద్భుత ప్రాజెక్టు అని తనకు తానే గొప్పలు చెప్పుకున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నలుమూలలా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులని హడావిడిగా కేసీఆర్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిందన్నారు. అయితే, ఆసుపత్రుల నిర్మాణం పేరుతో రూ.9 వేల కోట్ల రూపాయలు లోన్ రూపంలో తీసేసుకున్నారని, వాటి నిర్మాణం ప్రారంభదశలోనే ఉందన్నారు. ఆ బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై పడిందన్నారు. నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వం ఆసుపత్రుల నిర్మాణాన్ని గాలికి వదిలేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావించిందని మంత్రి రాజనర్సింహా ఆరోపించారు. ఒక్కో ఆస్పత్రిని 21 అంతస్తుల నుంచి 14 అంతస్తులకు తగ్గించామని వెల్లడించారు. వైద్య రంగంలోనూ రెగ్యులేటరీ పవర్స్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular