Thursday, May 1, 2025

24లోగా కౌంటర్‌ దాఖలు చేయండి

హెచ్‌సీయూ భూ వివాదంపై సోమవారం హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణ సందర్భంగా ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ కేసులో కౌంటర్, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హెచ్‌సీయూ భూముల వివాదంపై సుప్రీం కోర్టు, హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టులో హెచ్‌సీయూ భూములపై విచారణ జరుగగా.. పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందున ఈనెల 24కు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

24 లోపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించారు. అలాగే స్టేటస్ రిపోర్టు ఫైల్ చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది తన వాదనలు వినిపించారు. దీంతో ఫేక్ వీడియో, ఫారెస్ట్ తగులబెట్టిన వీడియోలపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ రిపోర్టుపై పోలీసులే కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు తెలిపడంతో.. తదుపరి విచారణ 24కు వాయిదా వేసింది హైకోర్టు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com