Monday, March 10, 2025

Chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ -11 మంది మావోయిస్టులు మృతి

దట్టమైన అడవిలో కొనసాగుతున్న కూంబింగ్

ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నారాయణపూర్‌ జిల్లాలో నక్సల్స్ కు భద్రతా దళాలలుక జరిగిన ఎదురు కాల్పుల్లో మొత్తం 11 మావోయిస్టులు చనిపోయారు. ఈ విషయాన్ని ఐజీ సుందర్‌రాజ్‌ ప్రకటించారు. ఛత్తీస్ గఢ్ లోని ధనంది కుర్రేవాయ అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిందని సుందర్ రాజ్ చెప్పారు. ఖోకామెటా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో జిల్లా రిజర్వ్‌ పోలీసులులతో పాటు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ దళాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి.

ఈ క్రమంలో ఎదురుపడ్డా మావోయిస్టులు కాల్పులకు దిగారని, దీంతో పోలీసు బలగాలు సైతం ఎదురుకాల్పులు జరిపినట్లు ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు. ప్రస్తుతం ఖోకామెటా అటవీ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ ఆపరేషన్‌ కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ ఆపరేషన్ లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని సుందర్‌రాజ్‌ తెలిపారు. ఈ కూంబింగ్ లో ఇద్దరు పోలీసులు సైతం గాయపడ్డారని అధికారిక వర్గాల సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com