రాష్ట్రానికి వానగండం తప్పింది. మంగళవారం నుంచి మోస్తరు వానలే కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళా ఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం 12 గంటల్లో బలహీనపడనుందని వెల్లడించింది. ప్రస్తుతం తూర్పు విదర్భ, దాని అనుకొని పెద్దపల్లి జిల్లాలోని రామగుండానికి ఉత్తర ఈశాన్య దిశలో 130 కిమీ దూరం లో కేంద్రకృతం అయిందని వివరిం చింది.
ఈ ప్రభావంతో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళవారం నుంచి మోస్తరు వర్ణాలే కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ లోనూ మోస్తరు వర్షం పడే అవకాశముందని వివరించింది.