టాలీవుడ్ లోకి ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. రవితేజతో చేసిన ఖిలాడీ సినిమా డిజాస్టర్ కాగా.. అడివి శేష్ సరసన కనిపించిన హిట్ 2 బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత మహేష్ సరసన గుంటూరు కారంలో నటించింది. ఇక గతేడాది చివర్లో లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి, ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో పలు సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. తన కెరీర్ ఆరంభం గురించి, తన బాల్యం గురించి మాట్లాడుతూనే.. చిన్నతనంలో ఇతరులతో మాట్లాడేందుకు ఇబ్బంది పడ్డానని ఓపెన్ అయ్యింది. అంతే కాకుండా కాలేజీ రోజుల్లో ఆ సమస్యతో బాధపడ్డానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ.. కాలేజ్ రోజుల్లోనే తన ఎత్తు 6.2 ఉండేదని.. దాంతో చాలా మంది అమ్మాయిలతో పోల్చితే ఎక్కువగా ఉండేదాన్ని అంటూ తెలిపింది. ఈ కారణం తోనే తనకు చాలా మంది డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారని చెప్పింది. దీంతో చాలా బాధగా అనిపించేదని.. ఆర్మీ ఆఫీసర్ అయిన తన తండ్రికి ఆ విషయం గురించి కూడా చెప్పినట్టు తెలిపింది. అయితే నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలని సూచించారని.. ఆ సమయంలో ఎక్కువగా బుక్స్ చదవడం అలవటు చేసుకున్నట్టు స్పష్టం చేసింది. అలానే అందాల పోటీల్లో పాల్గొనడం, ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఆఫర్ సద్వినియోగం చేసుకోవడం జరిగిందన్నారు.