Sunday, May 11, 2025

జైలు నుంచి రాగానే ముఖ్యమంత్రి పగ్గాలు

జార్ఖండ్ 13వ సీఎంగా హేమంత్ సోరెన్

జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో హేమంత్ సోరేన్ జార్ఖండ్ కు 13వ ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు ముందు చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ జేఎంఎం నేత హేమంత్ సోరెన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాంచీలోని చంపై సోరెన్ నివాసంలో జరిగిన సమావేశంలో అధికార కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు జార్ఖండ్ ముక్తి మోర్చా లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా హేమంత్ సోరెన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

దీంతో ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ రాజీనామా చేశారు. అంతకు ముందు చంపై సోరెన్, హేమంత్ సోరెన్‌ లతో పాటు గవర్నర్‌ను కలిసిన రాష్ట్ర అధికార కూటమి ప్రతినిధి బృందంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు, మంత్రి సత్యానంద్ భోక్తా, ఎమ్మెల్యే వినోద్ సింగ్ కూడా పాల్గొన్నారు. భూముల కుంభకోణం ఆరోపణలపై హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లి ప్రస్తుతం బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com