Saturday, December 28, 2024

రేవంత్ రెడ్డికి బాల‌కృష్ణ శుభాకాంక్ష‌లు

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కావ‌డంతో కాంగ్రెస్ కంటే తెలుగుదేశం పార్టీ నాయ‌కులే ఎక్కువ‌గా సంబ‌ర‌ప‌డుతున్న‌ట్లుంది. ఆయ‌న‌ను కాంగ్రెస్ హైక‌మాండ్ సీఎంగా ప్ర‌క‌టించిన వెంట‌నే న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు.. ప్రజా సేవ పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగార‌ని.. తెలంగాణ ప్రజలు ఆయ‌న‌పై పెట్టుకున్న నమ్మకాన్ని వ‌మ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చాలని కోరారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిపదంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నాన‌ని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఆయ‌న పాలన మార్క్ తో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ బాల‌కృష్ణ శుభాకాంక్ష‌లు చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com