Friday, January 10, 2025

నిఖిల్‌కి ప్రమోషన్‌ వచ్చింది

హీరో నిఖిల్ కి ప్రమోషన్‌ వచ్చింది. ఏంటా.. అని ఆలోచిస్తున్నారా.. నిఖిల్‌ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియాలో ప్రకటించారు. భార్య ప‌ల్ల‌వి సీమంతం ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఈ గుడ్‌ న్యూస్‌ని అందరితో పంచుకున్నాడు. ‘మా మొదటి బిడ్డ అతి త్వ‌ర‌లోనే రాబోతుంది. ప‌ల్ల‌వి..నేను ఎంతో సంతోషంగా ఉన్నాం. మీ అంద‌రి దీవెన‌లు మాకు అవ‌స‌రం’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో నిఖిల్ దంప‌తులు త‌ల్లిదండ్రులు కాబోతు న్న‌ట్లు అధికారిక వార్త ఇది. ఇంత వ‌ర‌కూ ఈ విష‌యాన్ని నిఖిల్ ఎక్క‌డా కూడా రివీలే చేయ‌లేదు.

నేరుగా సీమంతం ఫోటోల‌తోనే అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేయ‌డం విశేషం. దీంతో ప్రేక్ష‌కాభిమానులు ఆ దంప‌తుల‌కు విషెస్ తెలియ‌జేస్తున్నారు. భార్య‌తో క‌లిసి దిగిన ఫోటోను నిఖిల్ షేర్ చేసాడు. ఇక నిఖిల్ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ‘కార్తికేయ‌-2′ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే ఆ త‌ర్వాత పాన్ ఇండియా చిత్రాలు చేయ‌లేదు. ’18 పేజీస్’..’.స్పై’ చిత్రాల్లో న‌టించాడు. అవి రీజ‌న‌ల్ మార్కెట్ ని టార్గెట్ చేసి రిలీజ్ చేసాడు. ప్ర‌స్తుతం నిఖిల్ ‘స్వ‌యంభు’ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. స్వయంభు ప్రేక్షకుల్లోనే కాదు సెలబ్రెటీల్లో సైతం అమితాసక్తి క్రియేట్ చేసింది. ఇందులో నిఖిల్ యుద్ధ వీరుడుగా కనిపించనున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే బోలెడంత బ‌జ్ క్రియేట్ అవుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com