Tuesday, April 22, 2025

Breaking: టాలీవుడ్ హీరో రవితేజకు షూటింగ్‌లో తీవ్ర గాయాలు….!

  • కొత్త డైరెక్టర్ భాను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్టీ 75 
  • హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ
  • షూటింగ్ సందర్భంగా గాయపడిన రవితేజ

తెలుగు సినీ నటుడు రవితేజ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డాడు. ఈ గాయం తీవ్రం కావడంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఆరువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు డాక్టర్లు సూచించారు. కొత్త డైరెక్టర్ భోగవరపు భాను దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘ఆర్టీ 75’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

షూటింగ్ సందర్భంగా గురువారం ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఆయన కుడిచేతికి గాయమైంది. ఈ గాయాన్ని లెక్కచేయకుండా ఆయన షూటింగ్‌లో పాల్గొనడంతో అది పెద్దగా అయింది. దీంతో ఆపరేషన్ చేయవలసి వచ్చింది. రవితేజ గాయపడిన విషయం తెలిసిన అభిమానులు… త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. రవితేజకు ఆపరేషన్ విజయవంతమైందని యశోద ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. రవితేజకు ఆరువారాల విశ్రాంతి అవసరమన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com