Friday, December 27, 2024

‘శ్వాగ్’ ఇంటిల్లిపాది చూడదగ్గ సినిమా- హీరో శ్రీవిష్ణు

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో శ్రీవిష్ణు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

శ్వాగ్ సినిమా గురించి, ఇందులో మీ రాజ్యం గురించి చెప్పండి ?

శ్వాగ్.. అంటే శ్వాగనిక వంశానికి సుస్వాగతం. అంత పెద్ద టైటిల్ ని పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని షార్ట్ గా ‘శ్వాగ్’ అని టైటిల్ పెట్టాం.

శ్వాగ్ ఒక వంశానికి సంబధించిన కథ. మాత్రు, పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 1500 సంవంత్సవంలో మొదలయ్యే కథ. మగ గొప్పా ? ఆడ గొప్పా ? అనే అంశంపై చిన్న టిట్ ఫర్ టాట్ లాంటి కథ. తెలుగు ప్రేక్షకులు కొత్త కథ ఎప్పుడు చెప్పినా ఆదరించారు. అదే ధైర్యంతో ఈ సినిమా చేయడం జరిగింది.

నేను ఎప్పుడూ డ్యుయల్ రోల్స్ చేయలేదు. ఇందులో నాలుగు పాత్రలు చేశాను. అందరూ ఒకే పోలికతో వుండే ఒకే వంశస్తులే. నాలుగు పాత్రలు వున్నప్పడు ఎలా చేయాలనేది ఛాలెంజ్ గా అనిపించింది. వన్స్ గెటప్స్ అన్నీ సెట్ అయ్యాక.. చాలా బాగా కుదిరింది.  సినిమా చాలా బావొచ్చింది. ఇంటిల్లిపాది చూడదగ్గ సినిమా ఇది. పెద్దవాళ్ళకి సినిమా విపరీతంగా నచ్చుతుంది. అలాగే యంగ్ ఆడియన్స్ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో వున్నాయి. సినిమా చూసి పేరెంట్స్ ని కూడా సినిమాకి తీసుకువెళ్తారు. ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఇందులో వున్నాయి. మన వంశం గురించి, పెద్దల గురించి, తాతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటనేది ఇందులో చాలా చక్కగా చూపించడం జరిగింది.

చాలా పెద్ద కథ ఇది. రెండున్న గంటల్లో ఇంత పెద్ద కథ చెప్పారా అని సినిమా చూసిన తర్వాత దర్శకుడిని ప్రేక్షకులు అభినందిస్తారు. కథలో బాగంగానే ఎంటర్‌టైన్మెంట్ వుంటుంది. అందరి ఆడియన్స్ కి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నా కెరీర్ లో ఈ సినిమా వన్ అఫ్ ది టాప్ ఫిల్మ్ గా నిలుస్తుందనే నమ్మకం వుంది.

శ్వాగ్ టైటిల్ లో డాగ్స్ కనిపిస్తాయి.. దాని గురించి చెప్పండి ?

శ్వాగనిక వంశ రాజులు సింహాసనాలపై కూర్చుకున్నప్పుడు పక్కన డాగ్స్ ని పెట్టుకుంటారు. డాగ్స్ ని గుంపులు వేసుకొని వస్తుంటారు. అదొక సింబాలిక్ గా టైటిల్ లో పెట్టాం.  ఇందులో క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ బాగా కుదిరాయి. రీతూ వర్మ క్యారెక్టర్ లో చాలా మంచి ట్రాన్స్ ఫర్మేషన్ వుంటుంది. ఈ సినిమా చూసాక ఆడవాళ్ళని ఒక మెట్టు ఎక్కువ అభిమానం, గౌరవంతో చూస్తాం. భవభూతి క్యారెక్టర్ ని కూడా సినిమా పూర్తయిన తర్వాత ఆడవాళ్ళు అందరూ చాలా ఇష్టపడతారు. ఈ సినిమా చూసినప్పుడు నటులు కాకుండా పాత్రలే గుర్తుంటాయి.

శ్వాగ్’ లో నాలుగు తరాలని చూపించారు కదా? స్క్రీన్ ప్లే ఎలా వుంటుంది ?

ఒక కుటుంబం కథ చెప్పినప్పుడు స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమేయ్యేలా వుండాలి. ఎలాంటి కన్ఫ్యుజన్ వుండకూడదు. శ్వాగ్ లో స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమయ్యేలా చాలా ఎంగేజింగ్ గా వుంటుంది. సింపుల్ గా వుంటునే చాలా కొత్తగా వుంటుంది.

మీరా జాస్మిన్ క్యారెక్టర్ గురించి ?

మీరా జాస్మిన్  చాలా అద్భుతంగా చేశారు. 90లో మదర్ లాంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ని చూసినప్పుడు అందరి మదర్స్ గుర్తుకు వస్తారు. ఆ పాత్ర చాలా హుందాగా హోమ్లీ గా వుంటుంది. యునానిమస్ గా అందరికీ నచ్చుతుంది.

 

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com