Saturday, April 19, 2025

హీరోలతో సమాన పారితోషికం ఎందుకు ఉండదు?

ఏ ఇండస్ట్రీ అయినా సరే హీరోయిన్లు హీరోలతో సమానంగా పనిచేస్తారు. కానీ పారితోషికం విషయం వచ్చేసరికి మాత్రం ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది కథానాయికలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హీరోలతో సమానంగా పనిచేసినప్పుడు రెమ్యూనరేసన్‌ విషయం వచ్చేసరికి ఎందుకని అలా తేడా చూపిస్తున్నారు అనే అంశం ప్రస్తుతం అంతటా హాట్‌ టాపిక్‌గా మారింది. కొన్ని కొన్ని సన్నివేశాల్లో హీరోలకంటేకూడా హీరోయిన్లు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ వారికి సరైన పారితోషిక గుర్తింపు ఉండదు. ఓ టీ.వీ. షోలో ‘తలాష్‌’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్‌ స్టార్స్‌ ఈ విషయం పై చర్చించుకున్నారు. స్టార్‌ హీరోయిన్స్‌ రాణిముఖర్జీ, కరీనాకపూర్‌ ఖాన్‌ ఇదే విషయంపై అసహనం వ్యక్తం చేశారు. మేము కూడా హీరోలతో సమానంగా పని చేసినప్పటికీ దానికి తగిన పారితోషికం లభించడం లేదన్నారు. దీనికి ధీటుగా వెంటనే పర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ఖాన్‌ సమాధానమిచ్చారు. సినీ ఇండస్ట్రీ విషయానికి వచ్చేసరికి సమానత్వం అనేది. మగ.. ఆడ అని కాదు. ప్రేక్షకదేవుళ్ళని ఎవరైతే ఎక్కువగా థియేటర్లకి రప్పించగలరో వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. దాన్ని అనుసరించుకుని నిర్మాతలు పారితోషం ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

అదే విధంగా సమంత రూత్‌ ప్రభు కూడా ఇటీవలె ఓ పాడ్‌ కాస్ట్‌కు హాజరైన ఈమె నటీనటుల మధ్య పారితోషికం వ్యత్యాసం గురించి మాట్లాడింది. ఈమె కూడా హీరో.. హీరోయిన్ల మధ్య రెమ్యూనరేషన్‌ వ్యత్యాసం గురించి అసహనం వ్యక్తం చేసినప్పటికీ కొన్ని విషయాలను తాను అంగీకరిస్తున్నట్లు కూడా తెలిపింది. ప్రేక్షకులని ధియేటర్‌కు రప్పించగల విషయాలును తాను ఒప్పుకుంటున్నట్లు తెలిపింది.

సమానత్వం…
ఇక కొన్ని చిత్రాల్లో హీరో హీరోయిన్‌కు సమాన ప్రాధాన్యత ఉన్నప్పటికీ పారితోషికం విషయం వచ్చేసరికి సమానత్వం ఉండేది కాదు. అదెందుకో ఇప్పటికీ చాలా మంది హీరోయిన్లు అర్ధం కాదు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓస్టార్‌ హీరో సినిమా విడుదలవుతుంది అంటే ఆ చిత్ర కాథాంశం గురించి ప్రేక్షకుడు ఆలోచించడు. కేవలం ఆ హీరో కోసం థియేటర్‌ కు వెళ్ళి సినిమాని చూసి హిట్‌ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలా ఓ హీరోయిన్‌ సినిమా విడుదలయితే. అది ఎంత పెద్ద హిట్‌ అయినప్పటికీ హీరోలకు బాక్సాఫీస్‌ వద్ద వచ్చినంత కలెక్షన్లు హీరోయిన్లకు రావు. అంతేకాక ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా స్టార్‌ హీరోలకు ఉన్నంతగా ఎంత పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అయినప్పటికీ అది అసాధ్యమనే తెలపాలి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com