Friday, September 20, 2024

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం….

కృష్ణాజిల్లా గుడివాడ:గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం…. అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన…. రంగ ప్రవేశం చేసిన పోలీసులు. బాలికల హాస్టల్ వాష్ రూమ్ లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన.

సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వుయ్ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినిల నినాదాలు.కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై…. దాడికి యత్నించిన సహచర హాస్టల్ విద్యార్థులు.

విషయం తెలుసుకొని కాలేజీ హాస్టల్ కు చేరుకున్న పోలీసులు….

జూనియర్,సీనియర్ విద్యార్థులను అదుపు చేస్తూ…. ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు.విద్యార్థి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. తెల్లవారు 3.30 గంటల వరకు కొనసాగిన హైడ్రామా.

ఫైనల్ ఇయర్ విద్యార్థికు మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ ఆరోపిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు. బాలికల హాస్టల్ ల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ‘ ఎక్స్ ‘ వేదికగా పోస్ట్ లు పెట్టిన విద్యార్థులు.

వారం రోజులుగా ఇంత జరుగుతున్న చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ ను…. ప్రశ్నిస్తున్న విద్యార్థినీలు.వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసిన మేనేజ్మెంట్ స్పందించలేదంటూ.. ఆరోపిస్తున్న విద్యార్థులు.వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్న పోలీసులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular