Friday, April 18, 2025

హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

  • హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌
  • హైడ్రాను ప్రతివాదిగా చేయలేమన్న ధర్మాసనం

హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలు చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిమజ్జనాలు జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పటిషన్‌ సరికాదని కోర్టు పేర్కొంది. 2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది.

రాష్ట్ర హైకోర్టు మంగళవారం కీలక తీర్పునిచ్చింది. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇటీవల హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయకూడదని హైకోర్టులో లాయర్ వేణుమాధవ్‌ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో నిమజ్జనాలు చేయొద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనే అమలు చేయాలని కోరారు. ఇందుకోసం హైడ్రాను కూడా పిటిషనర్‌గా ప్రతివాదిగా చేర్చాలని అభ్యర్థించారు. అయితే ఈ పిటిషన్‌పై మంగళవారం ధర్మసనం విచారణ చేపట్టింది.

ముందుగా హైడ్రాను ప్రతివాదిగా చేర్చడాన్ని కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహ నిమజ్జనాలు చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. అయితే కోర్టు ధిక్కరణపై పిటిషనర్‌ సరైన ఆధారాలు చూపించలేకపోయారు. దీంతో నిమజ్జనాలు జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పటిషన్‌ సరికాదని కోర్టు పేర్కొంది. 2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదని.. అలాంటప్పుడు ఇప్పుడెలా హైడ్రాను పార్టీ చేస్తామని ప్రశ్నించింది. అధికారుల చర్యలను సమర్థించింది. అలాగే పీఓపీతో విగ్రహాలు తయారు చేయడంపై నిషేధం ఇవ్వలేమని.. పీఓపీ విగ్రహాలు తాత్కాలిక పాండ్స్‌లలో నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపింది. పిటిషనర్ ప్రత్యేక ఆదేశాల కోసం రిట్ పిటిషన్‌ కూడా వేయొచ్చని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇదిలాఉండగా.. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతుండగా హుస్సేన్‌సాగర్‌లో వినాయన నిమజ్జనాలకు పర్మిషన్ లేదంటూ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సాగర్‌లో గణేష్ నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలు కూడా ఏర్పాటు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com