Friday, May 9, 2025

నిబంధనల సవరణపై ఏం చేస్తారు

ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు!

తెలంగాణలో గ్రూప్-1 నియామకాల నిబంధనలు సంవరించడంపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత నిబంధనల ప్రయోజనాలతో పోలిస్తే కొత్త నిబంధనలు అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం వేస్తాయో స్పష్టం చేయాలని సూచించింది. నిబంధనల సవరణల వల్ల గతానికి, ప్రస్తుతానికి ఉన్న తేడాను వివరించాలని ఆదేశిస్తూ రాంబాబు వేసిన కేసు పిటిషన్ విచారణను సెప్టెంబరు 25కు వాయిదా వేసింది.

1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు..
ఈ మేరకు నల్గొండ జిల్లాకు చెందిన రాంబాబు 2018, 2019లో దివ్యాంగుల రిజర్వేషన్లపై నిబంధనలను సవరిస్తూ జారీ చేసిన 10, 96, 29 జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ రాంబాబు పిటిషన్ పై జస్టిస్‌ సుజయ్‌పాల్, జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావులతోకూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.

గత నిబంధనల ప్రకారం సమాంతర రిజర్వేషన్లు అమలుచేయాలని, 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు పిలవాలని రాంబాబు తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దీంతో సర్వీసు వ్యవహారాలపై సింగిల్‌ జడ్జి విచారించాల్సి ఉండగా హైకోర్డు వరకూ ఎలా వచ్చిందని ప్రశ్నించింది. చివరగా పిటిషన్ విచారణను సెప్టెంబరు 25కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com