బీసీ కులగణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో బీసీ కులగణన చేయ్యాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీ కులగణన చేయ్యాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చశారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ. ఈ క్రమంలో పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో పిటిషనర్ వాదనలకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. మూడు నెలల్లో బీసీ కులగణన చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.