Monday, April 7, 2025

ఎక్సైజ్ సుంకం కంపెనీలపైనే

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. లీటర్‌పై 2రూపాయలు పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. ప్రభుత్వం సోమవారం నాడు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 2 పెంచినట్లు ప్రకటించింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ మార్పులు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ భారం ప్రజలపై పడబోదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది కేవలం కంపెనీలకే వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఆయిల్‌ కంపెనీలు మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. గతంలో ఎక్సైజ్‌ డ్యూటీ పెంచినప్పుడల్లా దాన్ని వినియోగదారులపైనే వేసేవారు. కానీ, ఈసారి మాత్రం కేంద్రం.. ఆయిల్‌ కంపెనీలకు ఆదేశాలిచ్చింది. సుంకాన్ని వినియోగదారులపై వేయవద్దంటూ సూచించింది. కానీ, ఆయిల్‌ కంపెనీలు మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాయి.

గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌
ఇక, ఎల్పీజీ గ్యాస్‌ వినియోగదారులకు మాత్రం కేంద్రం షాక్‌ ఇచ్చింది. ఒక్కో సిలిండర్‌పై రూ. 50 పెంచారు. కమర్షియల్‌ తో పాటు గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ పైనా ఈ ధర వర్తించనున్నది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com