Tuesday, May 20, 2025

అలా విడాకులు తీసుకున్న భరణం ఇవ్వాల్సిందే వివాహేతర బంధంపై హైకోర్టు సంచలన తీర్పు

విడాకులు తీసుకున్న మహిళకు భరణానికి సంబంధించిన కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఓ సంచలన తీర్పును ఇచ్చింది. వివాహేతర సంబంధం కారణంగా తన మాజీ భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళ భరణం పొందటానికి అనర్హురాలని తీర్పునిచ్చింది. ఆమెకు నెలకు రూ.4,000 ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. 2019లో రాయ్‌పుర్​లో హిందూ ఆచారాలతో వారిద్దరికీ వివాహం జరిగింది. అయితే భర్త తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారంటూ మార్చి 2021లో ఇంటిని విడిచిపెట్టి ఆమె వెళ్లిపోయారు. అనంతరం ఆమె భర్త తనతో క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాయ్‌పుర్ ఫ్యామిలీ కోర్టులో భరణం కేసు దాఖలు చేశారు. ఈ కేసులోనే న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. అయితే, దీనిపై స్పందించిన భర్త, తన తమ్ముడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ భార్యతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రశ్నించగా, తనను తప్పుడు కేసులో ఇరికిస్తానంటూ ఆమె బెదిరించిందని కూడా ఆయన పేర్కొన్నారు.

నెలవారీ భరణం రూ.20,000కి పెంచాలని డిమాండ్
ఈ క్రమంలోనే దీనిపై విచారించిన ఫ్యామిలీ కోర్టు 2023 సెప్టెంబర్ 8న భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని పేర్కొంటూ విడాకులు ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం నవంబర్ 6న భార్యకు నెలవారీ భరణం రూ.4,000 చెల్లించాలని కోర్టు తీర్పునుచ్చింది. అయితే దీనిపై ఆమె సంతృప్తి చెందకుండా దానిని రూ.20,000కి పెంచాలని డిమాండ్ చేశారు.
చివరికి ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, భర్త తరఫున వాదించిన న్యాయవాదులు, ఆమెకు భరణం లభించదని హైకోర్టుకు తెలిపారు. తన క్లయింట్ భార్య, తన భర్త తమ్ముడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందున భరణానికి అనర్హురాలని కోర్టు ముందు చట్టబద్ధంగా నిరూపించారు. ఈక్రమంలోనే తీర్పునిచ్చిన కోర్టు, భర్తకు అనుకూలంగా విడాకులూ మంజూరు చేసింది. సెక్షన్ 125(4)లోని నిబంధనను పరిగణనలోకి తీసుకోకుండా భరణం ఉత్తర్వు జారీ చేశారంటూ భర్త తరపున న్యాయవాది తెలిపారు. “ముఖ్యంగా భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నా, తగిన కారణం లేకుండా తన భర్తతో కలిసి జీవించడానికి నిరాకరించినా, పరస్పర అంగీకారంతో విడివిడిగా జీవిస్తున్నా ఆమె భరణం కోరలేదు” అని న్యాయవాది కోర్టులో వాదించారు. భర్త తరఫు న్యాయవాది వాదనతో హైకోర్టు అంగీకరించింది. భార్య వివాహేతర సంబంధం కారణంగా ఫ్యామిలీ కోర్టు విడాకులిచ్చిన నేపథ్యంలో ఆమె భరణం పొందడానికి అనర్హురాలు అనడానికి తగిన సాక్ష్యమవుతుందని హైకోర్టు పేర్కొంది. సివిల్ కోర్టు జారీ చేసిన ఆదేశానికి విరుద్ధంగా హైకోర్టు వేరే అభిప్రాయాన్ని తీసుకోవడం సాధ్యం కాదని పేర్కొంది. కాబట్టి ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు భార్య వివాహేతర సంబంధంలో జీవిస్తున్నట్లు స్పష్టంగా నిరూపిస్తుందని చెప్పింది. అందువల్ల ఆమె భర్త నుంచి భరణం పొందేందుకు అనర్హురాలని హైకోర్టు అభిప్రాయపడింది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com