బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని ఆయన చేసిన అభ్యర్ధన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఘట్‌కేసరిలోని కొర్రెములలో శ్రీహర్ష కన్‌స్ట్రక్షన్ సెక్యూరిటీ గార్డుపై ఈటల రాజేందర్ చేయి చేసుకున్నారని అభియోగం ఉంది. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఎంపీ ఈటలపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని ఈటల హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ దశలో కేసును కొట్టివేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈటలపై నమోదైన కేసను కొట్టివేసేందుకు నిరాకరించి, కేసు గురించి కింది కోర్టులోనే తేల్చుకోవాలని ఈటలకు సూచించింది.