Wednesday, March 19, 2025

ఫైన్‌ రూ. కోటి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తావా..?

తెలంగాణ హైకోర్టు ఓ పిటిషన్ విషయంలో సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టును తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్ కు ఏకంగా రూ.1 కోటి జరిమానా విధించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భీమపాక నగేశ్‌ మంగళవారం సంచలన తీర్పు వెలువరించారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టునే తప్పుదోవ పట్టిస్తారా అంటూ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. కోటి రూపాయల జరిమానా విధించింది. హైకోర్టులో ఓ కేసు పెండింగ్‌లో ఉండగా.. ఆ విషయాన్ని దాచిన పిటిషనర్ వేరే బెంచ్‌ వద్ద పిటిషన్‌ వేసి ఆర్డర్‌ తీసుకున్నారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి నగేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా రిట్ పిటిషన్లు వేయటంపై ఆయన సీరియస్‌ అయ్యారు. అక్రమ మార్గాలలో విలువైన ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవాలని పిటిషనర్ యత్నించినట్లు గుర్తించారు. కోర్టులను మభ్యపెట్టాలని ప్రయత్నించడం, కోర్టుల సమయాన్ని వృథా చేయడంతో పాటు తప్పుదోవ పట్టించే యత్నం చేసినందుకు పిటిషనర్ కు కోటి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. అత్యంత భారీ జరిమానా విధిస్తూ తీర్పు రావడం తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com