Saturday, April 19, 2025

అత్యధికం భువనగిరి .. అత్యల్పం హైదరాబాద్

పార్లమెంట్​ ఎన్నికల పోలింగ్​లో సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల కమిషన్​ విడుదల చేసిన నివేదికల ప్రకారం.. అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో 72.34 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్ఫంగా హైదరాబాద్ నియోజకవర్గంలో 39.17 శాతం నమోదైంది. గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్ , మల్గాజిగిరిలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. సికింద్రాబాద్ లో 42.48 శాతం, మల్కాజిగిరిలో 46.27 పోలింగ్ నమోదైంది. కాగా, భువనగిరి పార్లమెంట్​ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్​ ఉండగా.. ఆ తర్వాత జహీరాబాద్​ సెగ్మెంట్​లో 71.91 శాతం, మెదక్​లో 71.33శాతం, ఖమ్మంలో 70.76 శాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈసారి కూడా ఎక్కువగా ఓట్లేశారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు ఆసక్తి చూపించడం లేదు. ఇక, సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఈ నియోజకవర్గంలో 47.88 శాతం పోలింగ్​ జరిగింది.

ఓటెద్దాం రండి
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్​లో తక్కువ ఓటింగ్​ నమోదైంది. ప్రధానంగా పాతబస్తీ ఏరియాలో ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపించలేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన పోలింగ్​ శాతాన్ని పరిశీలిస్తే.. తక్కువ స్థానంలో హైదరాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గమే నిలిచింది. హైదరాబాద్​సెగ్మెంట్​లో కేవలం 29.47 శాతం పోలింగ్​ జరిగింది. దీంతో కొంతమంది యువత ఓటర్లను పిలిచేందుకు వీధుల్లో తిరిగారు. ఒక్కో ఇంటికి వెళ్లి తలుపులు కొడుతూ ఓటేయాలని అభ్యర్థించారు.

==
ఉదయం 9 గంటలకు 9.51 శాతం
ఉదయం 11 గంటలకు 24.31 శాతం
మధ్యాహ్నం 1 గంటకు 40.38 శాతం
మధ్యాహ్నం 3 గంటలకు 52.34 శాతం
సాయంత్రం 5 గంటలకు 61.16 శాతం
==
నియోజకవర్గాల వారీగా..
==
అదిలాబాద్ -69.81
భువనగిరి -72.34
చేవెళ్ల -53.15
హైద్రాబాద్ -39.17
కరీంనగర్ -67.67
ఖమ్మం -70.76
మహబూబాబాద్ -68.60
మహబూబ్​నగర్ -68.40
మల్కాజిగిరి -46.27
మెదక్ – 71.33
నాగర్ కర్నూల్ -66.53
నల్గొండ -70.36
నిజామాబాద్ -67.96
పెద్దపల్లి -63.86
సికింద్రాబాద్ -42.48
వరంగల్ -64.08
జహీరాబాద్ -71.91
==
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (అసెంబ్లీ) 47.88 ( ఉపఎన్నిక)

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com