కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #సింగిల్‌తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. #సింగిల్ మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ రాజు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మీ సినిమాలు హారర్ యాక్షన్ టచ్ తో ఉంటాయి కదా,.. సింగిల్ లాంటి లవ్ ఫన్ మూవీ చేయడం ఎలా అనిపించింది?
నా ఫస్ట్ తమిళ్ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్. ఎస్పీబీ ప్రొడ్యూస్ చేశారు. బేసిగ్గా నేను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ని. పోకిరి, ఒక్కడు, వర్షం, అతడు, సైనికుడు ఇలా చాలా పెద్ద తెలుగు సినిమాలకి వర్క్ చేశాను. అప్పుడే సినిమా డైరెక్షన్ పై ఆసక్తి ఏర్పడింది. సందీప్ కిషన్ తో నిను వీడని నీడను సినిమా చేశాను.
ఈ కథ శ్రీ విష్ణుకి ఎప్పుడు చెప్పారు ?
కోవిడ్ సమయంలో ఈ కథని శ్రీ విష్ణుకి చెప్పాను. అప్పుడాయన బ్రోచేవారెవరు చేశారు. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. ఆయన కథ చెప్పిన తర్వాత మేము చాలా మాట్లాడుకున్నాం. తర్వాత 2023లో ఈ కథని గీతా ఆర్ట్స్ లో చెప్పాను. వాళ్లకు కూడా చాలా నచ్చింది. అలా ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయింది. నేను శ్రీ విష్ణు నటించిన సినిమాలన్నీ చూశాను. విష్ణు బాడీ లాంగ్వేజ్ టైమింగ్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఆయన్ని ఒక సెపరేట్ బాడీ లాంగ్వేజ్ టైమింగ్ తో ఆడియన్స్ చూస్తారు. సినిమా ఫుల్ ఫన్ మూడ్ లో ఉంటుంది.
అలాగే ఈ సినిమాలో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ వుంది. 90% ఆఫ్ స్టోరీలో ఆయన క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళు ఇద్దరి ఫన్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
కేతిక, ఇవానా గురించి?
ఇవానా, కేతిక ఇద్దరు అద్భుతమైన యాక్టర్స్. లవ్ టుడే సినిమా చూసినప్పుడు ఇవానా పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది ఇందులో కూడా తన పర్ఫార్మెన్స్ క్యూట్ గా ఉంటుంది. కేతికే కూడా తన పాత్రని అద్భుతంగా చేసింది. ఈ కథలో ఇద్దరి క్యారెక్టర్స్ ఈక్వల్ గా ఉంటాయి.
గీతా ఆర్ట్స్ గురించి ?
గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాకి కావలసిన ప్రతిదీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సమకూర్చారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ ప్రాజెక్టుని చేశాం.
రైటర్స్ భాను నందు గురించి?
నేను తమిళ్లో ఈ కథని చెప్పాను. నేను రాసుకున్నప్పుడు డైలాగ్స్ తమిళ్ స్టైల్ లో ఉన్నాయి. వాటిని తెలుగుకి తగ్గట్టుగా మార్చడడం కోసం భాను నందుతో కలసి వర్క్ చేయడం జరిగింది. డైలాగ్స్ చాలా ఫన్ ఫుల్ గా ఉంటాయి. శ్రీ విష్ణు డబ్బింగ్ లో చాలా ఫన్ యాడ్ చేశారు. స్క్రిప్టు 60% ఉంటే ఆయన 100% ఎలివేట్ చేశారు.
సింగిల్ మ్యూజిక్ గురించి ?
విశాల్ చంద్రశేఖర్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో పాటలన్నీ కథకు తగ్గట్టుగానే ఉంటాయి. ఆడియన్స్ సాంగ్స్ ని చాలా ఎంజాయ్ చేస్తారు
సింగిల్ లో ఫన్ తో పాటు ఎమోషన్ ఉందా ?
ఇది వెరీ సెంటిమెంటల్ స్టోరీ. ఇందులో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంది. రాజేంద్రప్రసాద్ తో వచ్చే సీక్వెన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్ యాక్టర్ తో వర్క్ చేయడం చాలా ఆనందం ఇచ్చింది.
ఒక తమిళ్ డైరెక్టర్ గా తెలుగులో సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది ?
ఇక్కడ ఎలాంటి సమస్య లేదు ఇక్కడ ఆర్టిస్టులు అందరు కూడా చక్కని తమిళ్ మాట్లాడుతారు. చాలా కంఫర్టబుల్ గా చూసుకుంటారు. నాకు తెలుగు అర్థం అవుతుంది. మా నాన్నగారు తెలుగే. మేము నెల్లూరు నుంచి తమిళనాడులో సెటిల్ అయ్యాం.
సింగిల్ కి సీక్వెల్ ఉంటుందా?
ఆలోచన అయితే ఉంది. దీంతోపాటు శ్రీ విష్ణు కోసం ఒక రెండు మూడు కథలు నా దగ్గర ఉన్నాయి. ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం. ఆయన బాడీ లాంగ్వేజ్ టైమింగ్ నాకు చాలా ఇష్టం. ఆయనతో మళ్ళీ మళ్ళీ కలిసి పనిచేయాలని ఉంది.