Friday, April 18, 2025

మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకున్న హిమాన్ష్

* మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకున్న హిమాన్ష్
* ఎక్స్ వేదికగా స్వయంగా వెల్లడి
టీఎస్​, న్యూస్​ :బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు, మాజీ మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు రావు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటు హక్కు వయసు ఎప్పుడో వచ్చినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో విదేశాలలో ఉండడంతో ఓటు హక్కు వినియోగించుకోలేదు. ప్రస్తుతం స్వదేశానికి చేరుకున్న హిమాన్షు తొలిసారి తన ఓటును వేశాడు.బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ సెంటర్‌లో  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం సిరా చుక్కను ముగ్గురు చూపించారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోకపోవడంపై హిమాన్షు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు.
‘తొలిసారి ఓటు వేశాను. అతిపెద్ద బాధ్యతను పూర్తిచేసినట్లు భావిస్తున్నా. అందరూ వెళ్లి ఓటు ద్వారా మీ అభిప్రాయాన్ని బలంగా.. స్పష్టంగా చెప్పండి’ అని హిమాన్షు ‘ఎక్స్‌’లో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా కుటుంబంతో ఓటు వేసిన ఫొటోలను పంచుకున్నాడు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com