మావోయిస్టుల శాంతి చర్చలపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, ఎన్‌కౌంటర్లను వెంటనే నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము ఎప్పుడూ హింసను సమర్ధించమని, హింసకు వ్యతిరేకం అని స్పష్టం చేశారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం చూపిస్తాయని, చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని, కేంద్రం.. మావోయిస్టులతో చర్చలు చేయాలన్నదే తమ ఆలోచన అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, తమది జాతీయ పార్టీ కాబట్టి కేంద్ర నాయకత్వంతో మాట్లాడిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని, హింసను రాజ్యం చేసినా, వ్యక్తులు చేసినా, సంస్థలు చేసినా మంచిది కాదని సీఎం హితవు పలికారు.