నేచురల్ స్టార్ నాని తన ‘HIT: The 3rd Case’ లో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. నాని హిట్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్‌గా ఉండనుంది. ఈ మూవీ న్యూ షూటింగ్ షెడ్యూల్ కాశ్మీర్‌లో ప్రారంభమైంది, ఇక్కడ టీం ఇతర కీలక సన్నివేశాలతో పాటు నాని, ఫైటర్స్ టీంతో కూడిన ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంది. ఇప్పటికే నిర్మాతలు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయడమతో ప్రొడక్షన్ పనులు సజావుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. నాని క్యారెక్టర్ ఇటీవలి గ్లింప్స్ లో చూపినట్లుగా, ఇంటెన్స్, ఫెరోషియస్ గా ఉంటుంది. తన పాత్ర టఫ్, డైనమిక్ పర్సోనకి సరిపోయేలా నాని అద్భుతంగా మేక్ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు.