Wednesday, April 30, 2025

హిట్‌3కి ప్రభుత్వ ఆదేశాలు

స్టార్‌ హీరో నాని వన్ మాన్ షో ‘హిట్ 3’ మే 1న పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నాని సరసన కేజిఎఫ్ భామ ‘శ్రీనిధి శెట్టి’ జత కట్టగా సూర్య శ్రీనివాస్, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాధ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వాల్ పోస్టర్ సినిమా, యునానమిస్ ప్రొడక్షన్స్ పై నాని, ప్రశాంతి తిప్పరనేని నిర్మించగా మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ టికెట్ రేట్స్ పెంపుకి అనుమతిని ఇస్తు ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ఉత్తర్వులలో జిఎస్టి తో కలుపుకొని సింగిల్ స్క్రీన్స్ లో యాభై రూపాయలు, మల్టిప్లెక్స్ లలో డెబ్భై ఐదు రూపాయలు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది. కాకపోతే ఈ పెంపు ధరలు వారం రోజులు మాత్రమే ఉండేలా కూడా తన ఆదేశాల్లో పేర్కొంది. హిట్ 3 రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నిడివితో తెరకెక్కగా సెన్సార్ వాళ్ళు ‘A ‘సర్టిఫికెట్ ని జారీ చెయ్యడం జరిగింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com