Tuesday, March 18, 2025

Home Minister Anita ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన హోంమంత్రి అనిత

మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశం

రాష్ట్రంలో శాంతిభద్రతలు, దీపావళి నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లపై చర్చ

185 అగ్నిమాపక స్టేషన్లు, సిబ్బంది ఎక్కడ ప్రమాదం జరిగినా అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలిచ్చినట్లు హోంమంత్రి వెల్లడి

100 లేదా 101 నంబర్లకు ఫోన్ లు చేసి టపాకాయల అక్రమ తయారీపై పోలీస్, ఫైర్ వ్యవస్థలకు ఫిర్యాదు చేసేలా చర్యలు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామం తరహా దీపావళి టపాకాయల పేలుడు ఘటనలు జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాలన్న డిప్యూటీ సీఎం

వాయు కాలుష్యం దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్న పవన్ కళ్యాణ్

కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకటించిన ‘దియాజలావ్’ కార్యక్రమం తరహాలో ఏపీలోనూ ప్రజలకు అవగాహన కల్పించాలన్న డిప్యూటీ సీఎం

పర్యావరణహిత టపాకాయలకు పెద్దపీట వేస్తూ దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం

విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాకు సంబంధించి తాజా పరిస్థితులపై ఉపముఖ్యమంత్రి ఆరా

ప్రస్తుతం డయేరియా కేసుల నమోదు తగ్గిందని పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు హోంమంత్రి వెల్లడి

ఇటీవల రాష్ట్రంలో విమానాలలో బాంబు బెదిరింపులపైనా హోంమంత్రిని అడిగి వివరాలు తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి

వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన రాష్ట్రంలోని అరాచక పరిస్థితులు ఇటీవల బయటికి వస్తున్న దుర్మార్గాలపై చట్టప్రకారం వేగంగా దర్యాప్తు చేసి, నిందితులను శిక్షించేలా చూడాలని ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నిర్వహణ పట్ల డిప్యూటీ సీఎం ప్రశంసలు

నేరాల నియంత్రణలో మొబైల్ ఫోన్ వినియోగించాలని హోంమంత్రి ప్రజల భాగస్వామ్యం కోరడాన్ని అభినందించిన పవన్ కళ్యాణ్

డ్రగ్స్, గంజాయి,సైబర్ నేరాల పట్ల గతంలో లేని విధంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు వెల్లడించిన హోంమంత్రి

పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను ఉపముఖ్యమంత్రికి వివరించిన హోంమంత్రి

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో లింగాపురం నుంచి కొడవటిపూడి కట్ట వరకు సుమారు కి.మీ మేర నిర్మించనున్న ఆర్ అండ్ బీ రోడ్డుకు అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని కోరిన హోంమంత్రి

పాయకరావుపేటలోని వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తికి చొరవ చూపాలని డిప్యూటీ సీఎంకు వినతి పత్రం సమర్పణ

తన నియోజకవర్గంలోని పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం సహా ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రాధాన్యతను పవన్ కళ్యాణ్ కు తెలిపిన హోంమంత్రి.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com