Wednesday, April 2, 2025

జగన్ పై ప్రేమ ఉంటే ఉద్యోగాలు వదిలేయండి

* జగన్ పై ప్రేమ ఉంటే ఉద్యోగాలు వదిలేయండి
* ఆ పార్టీ కోసం పనిచేసుకోండి
* హోంమంత్రి అనిత
ఏపీ హోం మంత్రి, టీడీపీ ఫైర్ బ్రాండ్ మహిళా నేత వంగలపూడి అనిత ఇవాళ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొందరు పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని మండిపడ్డారు. వారిలో ఇంకా వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు. మీకు జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే… ఉద్యోగాలు వదిలేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోండి అంటూ అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడ తప్పు జరిగినా బాధ్యులను వదిలేది లేదని స్పష్టం చేశారు. సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కానివ్వబోనని తెలిపారు.
అంతకుముందు, సింహాచలం ఆలయంలో హోంమంత్రి అనితకు ప్రోటోకాల్ అనుసరించి పూర్ణకుంభ స్వాగతం లభించింది. ఆలయ గర్భగుడిలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com