Friday, April 4, 2025

Honey Trap: అమ్మాయి పిలిచిందని ఆశగా వెళ్లాడు

కట్ చేస్తే, సీన్లోకి ఆమెతోపాటు మరో నలుగురు

వలపు వల.. విసిరితే విలవిలలాడాల్సిందే.. ఇది తెలియక చాలామంది అమాయకులు జేబును గుల్ల చేసుకుంటున్నారు తాజాగా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది అతనొక వ్యాపారి అతనికి ఓ అమ్మాయి పరిచయమైంది ఆమె ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా పరిచయం చేసుకుని నెంబర్ ఇచ్చింది ఇంకేముంది. ఆ తర్వాత ఫోన్లు కనెక్టయ్యాయి తీరా ఏకాంత వేళ ఇంటికి రమ్మని పిలవడంతో గురుడు లగెత్తుకుంటూ వెళ్లాడు.. కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది. కారులో ఇద్దరూ వెళ్తుండగా నలుగురు వ్యక్తులు సీన్లోకి ఎంటరయ్యారు. మహిళను ఎక్కడికి తీసుకెళ్తున్నావంటూ దబాయిస్తూ ఆమెను కారులో నుంచి దింపేశారు. అనంతరం కారు ఎక్కి ముందుకు తీసుకెళ్లి.. బెదిరించి డబ్బులు లాక్కుని.. అక్కడి నుంచి పరారయ్యారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. వ్యాపారి నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనలో .. మహిళతో సహా ఐదుగురిని గుడ్డిమల్కాపూర్ పోలీసులు ఆగస్టు 20న మంగళవారం అరెస్టు చేశారు. ఫర్నీచర్‌ వ్యాపారి అయిన బాధితుడు.. ఇటీవల ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా ఉన్న మహిళను కలిశాడు. ఒక వారం క్రితం, ఆమె వ్యాపార ప్రమోషన్ కార్యకలాపాల గురించి చర్చించడానికి మెహిదీపట్నంలోని తన ఇంటి దగ్గరకు రమ్మని పిలిచింది. వెళ్లిన తర్వాత ఇద్దరు కారులో మాట్లాడుకుంటున్నారు.. ఈ క్రమంలోనే.. కొద్ది నిమిషాల తర్వాత రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు కారును అడ్డగించారు. మహిళను ఎక్కడికి తీసుకెళ్తున్నావని అడిగి ఆమెను కారులో నుంచి దింపేశారు. అనంతరం కారు ఎక్కి ముందుకు వెళ్లాలని బెదిరించారు.

అనంతరం వారు అతన్ని ఆసిఫ్ నగర్, సన్ సిటీ, అత్తాపూర్, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లారు.. ఈ సమయంలో వారు UPI ద్వారా డబ్బు బదిలీ చేయాలని అతన్ని బెదిరించారు. తరువాత, అతని దగ్గర నుంచి 90వేలకు పైగా నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. అనంతరం నిందితులు బాధితుడిని మెహిదీపట్నం వద్ద దించి పరారయ్యారు. దీంతో సదరు వ్యాపారి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడు అందించిన వివరాల ఆధారంగా పోలీసులు నిందితులు జోహా ఖాతూన్‌తో పాటు సయ్యద్ ముస్తఫా అలీ, బషీర్ ముస్తఫా, ముజాఫిర్ అహ్మద్, అబ్దుల్ ఫాజిల్‌లుగా గుర్తించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి.. నిందితులందరినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com