హౌసింగ్ బోర్డు భూముల వేలం ప్రక్రియ మొదలైంది. కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలో నివాసాల మధ్య ఖాళీగా ఉన్న 72 ప్లాట్లను వేలం వేసేందుకు నోటిఫికేష్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ భూముల వేలాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌసింగ్ స్థలాల వేలంలో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ భూముల వేలం వివాదాస్పదంగా మారింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కేపీహెచ్‌బీ భూమలు వేలం కొనసాగుతోంది. రోడ్డు విస్తరణలో కోల్పోయే ప్లాట్లను ప్రజలకు అమ్మి మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్లు పరిగణలోకి తీసుకోకుండా ఫ్లాట్లను అమ్మడంతో ప్రజలు నష్టపోతారంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో భూముల వేలాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌసింగ్ స్థలాల వేలంలో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మున్సిపల్ చట్టాలు, మాస్టర్ ప్లాన్‌ను పరిగణలోకి తీసుకోకుండా ప్లాట్లను అమ్ముకుని సొమ్ముచేసుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారని.. భూముల వేలాన్ని అడ్డుకుని తీరుతామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో మొత్తం 28 ఫ్లాట్లను హౌసింగ్ బోర్డ్ అధికారులు వేలం వేస్తున్నారు. హైకోర్టు స్టే తో 9వ ఫేజ్ మినహాయించి.. మిగిలిన ప్లాట్ల వేలం వేస్తున్నారు.
హైటెన్షన్
మరోవైపు కేపీహెచ్‌బీ భూముల వేలంలో హైటెన్షన్ నెలకొంది. అడుగడుగునా భారీగా పోలీసుల మోహరించారు. భారీ పోలీసుల బందోబస్తు నడుమ భూముల వేలం కొనసాగుతోంది. కాగా.. కేపీహెచ్‌బీలో భూముల వేలాన్ని జనసేన నేతలు కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వేలం ప్రాంగణానికి వచ్చిన జనసేన నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు, జనసేన నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నేతల ఆందోళన నేపథ్యంలో హౌసింగ్ భూముల వేలం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది.