Tuesday, May 13, 2025

గ్రేటర్ పరిధిలో పనిచేసే ఆర్టీసి ఉద్యోగులకు తగ్గనున్న 6 శాతం హెచ్‌ఆర్‌ఏ

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమ ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. గత ప్రభుత్వం 2017లో 16 శాతం మధ్యంతర భృతి ప్రకటించగా, తాజాగా ప్రస్తుత ప్రభుత్వం 21 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. తాజాగా ఆర్టీసి యాజమాన్యం శుక్రవారం జారీ చేసిన సర్క్యులర్‌లో హెచ్‌ఆర్‌ఏలను తగ్గించినట్లుగా తెలిసింది. కాగా, ఆర్టీసిలోని 42 వేల పైచిలుకు కార్మికుల్లో 20 వేలకు పైగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పని చేస్తున్నారు. ఈ నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే ఉద్యోగులు అత్యధికంగా నష్టపోయే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లకు ఇప్పటివరకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తుండగా ఆర్టీసి యాజమాన్యం తాజాగా దానిని 24 శాతానికి పరిమితం చేసింది. దీంతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు 6 శాతం హెచ్‌ఆర్‌ఏ తగ్గనుంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com