Saturday, February 22, 2025

వామ్మో.. చాయ్-బిస్కట్లకు 3 కోట్ల రూపాయలు

  • వామ్మో.. చాయ్-బిస్కట్లకు 3 కోట్ల రూపాయలు
  • తిరుపతి మునిసిపల్ కార్పోరేషన్ లో అవినీతి బాగోతం

ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో తిరుపతి మునిసిపల్ కార్పోరేషన్ లో జరిగిన అవినీతిని చూసి అంతా అవాక్కవుతున్నారు. కేవలం చాయ్, సమోసాలకు మూడు కోట్లు ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. తిరుపతి మునిసిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్లు గత మూడేళ్లలో నిర్వహించిన పలు సమావేశాలకు గాను చాయ్, బిస్కట్లు, సమోసాల కొనుగోలుకు ఏకంగా 3కోట్ల రూపాయలు ఖర్చయ్యాయట. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తిరుపతి మునిసిపల్ కార్పోరేషన్ కమీషనర్ గా నారపురెడ్డి మౌర్య బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయనకు కార్పొరేటర్లతో కలిసి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు నరసింహచారి చాయ్ బిస్కట్ల కు సంబందించిన అంశంపై వినతిపత్రం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు చాయ్, సమోసా, బిస్కెట్ లకు సంబంధించిన బిల్లును తిరస్కరించాలని, దీనిపై విచారణ జరిపించాలని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు కార్పోరేటర్లు.

గత మూడేళ్ల కాలంలో కార్పోరేషన్ లో జరిగిన అవకతవకలు, అప్పటి పరిస్థితుల గురించి వైసీపీ కార్పోరేటర్లు సైతం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్పోరేషన్ నిధులతో డబుల్ డెక్కర్ బస్సులు కొనుగోలు చేసి కొన్ని రోజులకే వాటిని మునిసిపాలిటీ డంపింగ్ యార్డులో పడేసిన వ్యవహారం సైతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం కమీషన్ల కోసమే బస్సును కొనుగోలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com