Thursday, September 19, 2024

చైనాలో ట్రంప్‌ క్రేజ్.. ఆయన ఫోటోలతో టీ షర్టులు

అగ్రరాజ్యం అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ పై కాల్పుల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ట్రంప్ పై కాల్పులు జరిగిన కొంతసేపటికే చైనాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైనాలో ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్‌ ఫొటో లతో కూడిన టీ షర్టులు వెల్లువెత్తాయి. డిజిటల్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి ట్రంప్ ఫోటోతో ఈ టీషర్ట్ లను రూపొందించారు. ఇప్పుడు చైనాలో ఎక్కడ చూసినా ట్రంప్ టీ షర్ట్ లే దర్శనమిస్తున్నాయి. వేలాది మంది యువకులు ట్రంప్ టీ షర్టులను ధరించి వీధుల్లో తిరుగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఎన్నికల ప్రచారంలో ఉండగా తనపై దాడి జరిగిన తరువాత.. ఫైట్.. ఫైట్‌.. అంటూ ట్రంప్‌ పిడికిలి బిగించి గట్టిగా నినాదాలు చేశారు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన చిత్రాలతో చైనాలోని బట్టల వ్యాపారులు టీ- షర్టులను రూపొందించారు. ముందు చైనా ఈ కామర్స్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన తొబావులో ట్రంప్ టీ షర్ట్ లు అందుబాటులోకి వచ్చాయి. ట్రంప్ టీషర్ట్ లకు ఆన్‌లైన్‌ లో భారీ స్పందన రావడంతో మరికొన్ని ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ లో ఈ టీషర్టులను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది.
చైనాలోని హైబీ ప్రావిన్సులో ఉన్న చాలా ఫ్యాక్టరీలలో ట్రంప్ ఫోటోలతో టీ షర్టులను ప్రింట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ట్రంప్ పై జరిగిన దాడికి సంబందించిన ఫొటోలను ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకొని క్షణాల్లో వాటిని టీ షర్ట్ లపై ప్రింట్‌ చేస్తున్నామని ఓ చైనా వ్యాపారి తెలిపాడు. ఈ సారి అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కు గెలిచే ఛాన్స్ ఉందని, ఆయనకు చైనీయుల్లోనూ చాలా పాపులారిటీ ఉందని స్థానికులు చెబుతున్నారు. అందుకు అనుగునంగానే కాల్పుల ఘటన తరువాత ట్రంప్ మరింత ప్రజాభిమానాన్ని పొందారని, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ట్రంప్ కు 70 శాతం ఛాన్స్ ఉందని సర్వేలు చెబుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular