Monday, April 21, 2025

ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్

ఈ నెల 9న ఐఫోన్16 లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఫోన్15 ధరలు భారీగా తగ్గాయి. ఐఫోన్‌ 15 ప్లస్‌128జీబీ బేస్‌ వేరియంట్‌ ధర యాపిల్‌ వెబ్‌సైట్ లో రూ.89,600గా ఉంది. అదే ఫ్లిప్‌కార్ట్‌లో అయితే రూ.75,999కే కొనుగోలు చేయొచ్చు. అంటే దాదాపు రూ.13 వేలకు పైగా తగ్గింపు పొందొచ్చు. హెచ్‌ఎస్‌బీసీ, ఫెడరల్‌ బ్యాంక్‌ క్రెడిట్‌కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కార్డ్‌ హోల్డర్లకు, యూపీఐ సాయంతో కొనుగోలు చేసే వారికి రూ.1,000 రాయితీ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో ఐఫోన్‌ 15 ప్లస్‌ 256జీబీ వేరియంట్‌ ధర రూ.85,999గా, 512జీబీ వేరియంట్‌ ధర రూ.1,05,999గా ఉంది. యాపిల్‌ వెబ్‌సైట్‌లో ఈ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. 9.7 ఇంచెస్ సూపర్‌ రెటినా ఎక్స్‌డీఆర్‌ ఓల్‌ఈడీ డిప్‌ప్లేతో ఐఫోన్‌ 15 ప్లస్‌ ఫోన్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. యూఎస్‌బీ టైప్‌- సీ సపోర్ట్‌తో తీసుకొచ్చిన ఈ మొబైల్‌లో.. 48 ఎంపీ సెన్సర్, 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ షూటర్‌, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com