Tuesday, May 13, 2025

మత్స్యకారులవలకు చిక్కిన బాహుబలి చేప

  • మత్స్యకారులవలకు చిక్కిన బాహుబలి చేప
  • వలలోచిక్కిన టేకు చేప బరువు 1500 కిలోలు

కృష్ణా జిల్లామత్స్యకారులకు భారీ చేప చిక్కింది. మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఏకంగా 1500 కిలోల టేకు చేప వలలో చిక్కింది. బందరు సముద్ర తీరంలోస్థానిక మత్స్యకారులు మూడు రోజులు క్రితం సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలోఓ బాహుబలి టేకు చేప వారి వలకు చిక్కింది. ఈ భారీ చేప బరువు ఏకంగా 1500 కిలోలు. వలలోచిక్కిన ఈ భారీ చేపను చూసి బందరు మత్స్యకారులు ఒక్కసారిగా షాక్తిన్నారు.

ఇక ఈ బాహుబలి టేకు చేపను సముద్రంలోంచి ఒడ్డుకు చేర్చడం కష్టతరమవ్వడంతో క్రేన్ సాయంతో తీసుకువచ్చారు. ఇంత భారీ చేప వలలో చిక్కిందన్నసమాచారంతో స్థానికులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి జనం ఈ చేపను చూడటానికి ఉత్సాహంచూపించడంతో అక్కడంతా జన సంద్రమయ్యింది. ఈ బారీ చేపకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇలాంటి భారీ టేకు చేపలు చాలా అరుదుగా వలలో పడతాయని స్థానిక మత్స్యకారులు తెలిపారు. అంతేకాదు ఈ చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందనిచెప్పారు. బందరు చేపల వ్యాపారులు ఈ భారీటేకు చేపను కొనేందుకు పోటీ పడ్డారు. భహిరంగ వేలంలో చెన్నై వ్యాపారులు భారీ ధరకు ఈ చేపను సొంతం చేసుకున్నారని మత్య్యకారులు తెలిపారు. ఐతే ఈ టేకు చేపలు తినడానికి పనికి రావని, ఆయుర్వేద మందులు తయారీకి ఉపయోగిస్తారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com