- రైల్వే శాఖకు రూ.3 వేల 871 కోట్ల ఆదాయం
ఆన్‌లైన్ బుకింగ్ వచ్చిన తర్వాత రైల్వే శాఖ ఆదాయం భారీగా పెరిగింది. రైళ్లలో జనం ప్రయాణించకపోయినా ఒకే ఒక్క సంవత్సరంలో (2022, 23 ఆర్థిక సంవత్సరంలో) రైల్వే శాఖకు అక్షరాల రూ.2 వేల 110 కోట్లను ఆర్జించింది. అదే విధంగా 2023, 24 (డిసెంబర్ వరకు) వెయిటింగ్ లిస్టు, రైల్వే టికెట్ రద్దు ద్వారా రూ.1,762 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా రెండేళ్లలో వెయిటింగ్ లిస్టులోని టికెట్‌ల రద్దు ద్వారా రైల్వే శాఖకు అక్షరాల రూ.3 వేల 871 కోట్లను సంపాదించింది.
రైల్వే శాఖ ఇంత ఆదాయం ఎలా వచ్చిందంటే….
ప్రయాణికుడు ఆన్ లైన్ ద్వారా ఒక రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చాలాసార్లు వెయిటింగ్ లిస్టు వస్తుంది. ఆ సమయంలో టికెట్ బుకింగ్‌కు 240 రూపాయలు అయిందనుకుంటే ఆ మొత్తాన్ని ప్రయాణికుడు ఆన్‌లైన్ ద్వారా కట్టేస్తారు. రైలు ప్రయాణం తేదీ వచ్చే నాటికి ప్రయాణికుడికి రైలులో బెర్త్ లేదా సీటు దొరకలేదు. దీంతో వెయిటింగ్ లిస్టు టికెట్ రద్దు అవుతుంది. ప్రయాణికుడు చెల్లించిన 240 రూపాయలు మళ్లీ తిరిగి మీ అకౌంట్ లోకి రావాలి, కానీ, అలా జరగటం లేదు. 240 రూపాయలకు గాను 180 రూపాయలు రీఫండ్ అవుతున్నాయి. మిగతా 60 రూపాయలు సర్వీస్ ఛార్జీలు (వెబ్‌సైట్, ఆన్‌లైన్ లావాదేవీల) రూపంలో కట్ చేసుకొని 180 రూపాయలను తిరిగి ఇస్తున్నారు.