Sunday, April 13, 2025

అట్టహాసంగా శోభాయాత్ర

హనమత్‌ ‌జయంతి సందర్భంగా భారీ ర్యాలీ
గౌలిగూడ నుంచి తాడ్బంద్‌ ‌వరకు యాత్ర
ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సిపి సివి ఆనంద్‌
‌తాడ్‌బంద్‌ ఆం‌జనేయుడిని దర్శించుకున్న నటి ప్రీతిజింటా

గౌలిగూడలోని శ్రీరామ మందిరం నుంచి హనుమాన్‌ ‌శోభాయాత్ర శనివారం ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. హనుమత్‌ ‌జయంతిని పురస్కరించుకుని గౌలిగూడ నుంచి కోఠి, నారాయణగూడ బైపాస్‌ ‌దుగా సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ ‌హనుమాన్‌ ఆలయం వరకు ఈ ర్యాలీ సాగింది. యాత్రలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. 12 కిలోమీటర్ల యాత్రకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీసీ కెమెరాలు, డ్రోన్లతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ ‌నగర సీపీ సీవీ ఆనంద్‌ ‌గౌలిగూడలోని శ్రీరామ మందిరానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. అలాగే కర్మన్‌ ‌ఘాట్‌ ‌హనుమాన్‌ ‌దేవాలయం నుంచి వీర హనుమాన్‌ ‌శోభాయాత్ర ప్రారంభమైంది. సైదాబాద్‌, ‌మాదన్నపేట మీదుగా ఈ యాత్ర కొనసాగింది. హనుమాన్‌ ‌జన్మదినాన్ని పురస్కరించుకుని ఊరూవాడా వీరహనుమాన్‌ ‌శోభాయాత్రలు ఘనంగా జరిగాయి. వేలాది మంది భక్త జనసందోహం నడుమ హనుమాన్‌ ‌శోభాయాత్ర కన్నులపండువగా సాగాయి. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్‌ ‌హనుమాన్‌ ఆలయం వరకు శోభాయాత్ర సాగింది.

ఇదిలా ఉండగా.. హనుమాన్‌ ‌జయంతి సందర్భంగా పంజాబ్‌ ‌కింగ్స్ ఓనర్‌ ‌ప్రీతి జింటా తాడ్‌బండ్‌ ‌వీరాంజనేయస్వామిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం తాడ్‌బండ్‌ ‌హనుమాన్‌ ఆలయానికి వొచ్చిన ప్రీతి జింటా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పల్‌ ‌వేదికగా సన్‌రైజర్స్‌తో పంజాబ్‌ ‌కింగ్స్ ‌తలబడనుంది. ఈ సందర్భంగా పంజాబ్‌ ‌కింగ్స్ ‌విజయాన్ని కోరుతూ ప్రీతిజింటా వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కాగా..

ఉప్పల్‌ ‌స్టేడియంలో పంజాబ్‌ ‌కింగ్స్‌తో సన్‌రైజర్స్ ‌హైదరాబాద్‌ ‌తలపబడనుంది. ఈ మ్యాచ్‌ ‌సన్‌రైజర్స్‌కు అత్యంత కీలకమని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఆడిన ఐదు ఆటల్లో వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ సన్‌రైజర్స్ ఓటమి బాటపట్టిన విషయం తెలిసిందే.. ఇక పంజాబ్‌ ‌కింగ్స్ ‌విషయానికొస్తే… గత మ్యాచ్‌లో చైన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించింది. ఈ నేపథ్యంలోనే ప్రీతి జింటా తాడ్‌బండ్‌ ‌హనుమంతుడి ఆలయాన్ని సందర్శించడం, ఆంజనేయుడి ఆశీస్సులు తీసుకోవడం చర్చనీయాంశంగా మరింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com