Sunday, January 5, 2025

Metapneumo virus in china చైనాలో మరో మహమ్మారి

మళ్లీ కరోనా తరహా లక్షణాలు

మొన్నటిదాకా దేశాన్ని వణికించిన చైనాలో ఇప్పుడు మరో వైరస్‌ వ్యాప్తి కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అక్కడ హ్యూమన్‌ మెటాప్న్యూమోవైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందిందని వార్తలు వస్తున్నాయి.
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో ఇప్పుడు మరో వైరస్‌ వ్యాప్తి కలవరానికి గురిచేస్తోంది. కొవిడ్‌ వెలుగులోకి వచ్చిన సరిగ్గా ఐదేండ్ల తర్వాత మరో ప్రమాదకర వైరస్‌ వ్యాప్తి చెందుతున్నదని స్థానిక, సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్‌ బారినపడి అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. హెచ్‌ఎమ్‌పీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్‌ -19 వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే, దీనిపై స్పష్టత లేదు.

కొవిడ్‌ తరహా లక్షణాలే
ఈ వైరస్‌ సోకిన వారిలో కొవిడ్‌ తరహా లక్షణాలే కనిపిస్తాయని తెలిసింది. దగ్గు, జ్వరం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. వైరస్‌ తీవ్రమైతే బ్రోన్కైటిస్‌, న్యుమోనియా వంటి సమస్యలకు దారితీస్తుంది. మూడు లేదా ఆరురోజుల వరకూ లక్షణాలు ఉంటాయి. ఇన్‌ఫెక్షన్ తీవ్రతను బట్టి లక్షణాలు వేర్వేరు వ్యవధిలో ఉంటాయి.

కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్‌ ఈజీగా సోకుతుంది. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లపై ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్‌ దరి చేరకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చేతులను తరచూ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం.. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, రద్దీ ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండడం వంటివి తప్పనిసరిగా పాటించాలి. తద్వారా వైరస్‌ వ్యాప్తిని కాస్తమేర కట్టడి చేసే అవకాశం ఉంటుంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com